Crime Thriller OTT: పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ - థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో...
Crime Thriller OTT: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పలాయం పీసీ థియేటర్లలో విడుదలైన పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో రాహుల్ మాధవ్, రమేష్ కొట్టాయం కీలక పాత్రల్లో నటించారు.
Crime Thriller OTT: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ పలాయం పీసీ థియేటర్లలో రిలీజైన పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. పలాయం పీసీ మూవీలో రాహుల్ మాధవ్, కొట్టయం రమేష్, జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలు పోషించారు.
ఐఎమ్‌డీబీలో...
మలయాళంలో చిన్న సినిమాగా రిలీజైన పలాయం పీసీ డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమాకు 8.5 రేటింగ్ దక్కింది. పలాయం పీసీ మూవీకి వీఎన్ అనిల్ దర్శకత్వం వహించాడు. కోటిలోపే బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ రెండు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
నైట్ డ్యూటీ కానిస్టేబుల్ కథ...
చంద్రన్ నాయర్ పలాయం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. రిస్క్ ఉండదనే ఆలోచనతో ఎక్కువగా నైట్ డ్యూటీలోనే ఉంటాడు. సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన ఓ మహిళా సంఘ సంస్కర్త ప్రాణాలు ప్రమాదంలోపడతాయి.
ఆమెను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ సంఘ సంస్కర్త రక్షణగా ఉండే బాధ్యతను పై అధికారులు చంద్రన్ నాయర్‌కు అప్పగిస్తారు. అతడు డ్యూటీలో ఉన్న టైమ్‌లోనే ఆ మహిళ చనిపోతుంది? ఆమెను చంపింది ఎవరు? అసలైన హంతకుడిని చంద్రన్ ఎలా పట్టుకున్నాడు? చంద్రన్ ప్రతిభకు మెడల్ దక్కిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సీరియస్ క్రైమ్ థ్రిల్లర్...
పాటలు, లవ్‌స్టోరీల లాంటి కమర్షియల్ హంగులకు తావులేకుండా సీరియస్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు అనిల్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాన్సెప్ట్‌తో పాటు కథలోని ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. స్టార్స్ ఎవరూ ఈ సినిమాలో లేరు. క్యారెక్టర్ ఆర్టిస్టులతో ప్రయోగాత్మకంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు.
గీతాంజలి మళ్లీ వచ్చింది...
మలయాళంలో సీనియర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్నాడు రాహుల్ మాధవ్. హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్, పురింజు మరియం జోస్, కడువా, హంట్‌తో పాటు వందకుపైగా సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా నటించాడు. అంజలి హీరోయిన్‌గా నటించిన గీతాంజలి మళ్లీ వచ్చిందితో రాహుల్ మాధవ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో మెయిన్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించాడు.