Crime Drama OTT: ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళం క్రైమ్ డ్రామా మూవీ -లేడీ గ్యాంగ్‌స్టర్ కథ-ట్విస్ట్‌లు, టర్న్‌లతో
Crime Drama OTT: మలయాళం క్రైమ్ డ్రామా మూవీ ది గాంబినోస్ థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మలయాళం మూవీలో రాధికా శరత్‌కుమార్, సంపత్ రాజ్, విష్ణువినయ్ కీలక పాత్రలు పోషించారు.
Crime Drama OTT: మలయాళం క్రైమ్ డ్రామా మూవీ ది గాంబినోస్ ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రిలీజైంది. శుక్రవారం నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ది గాంబినోస్ మూవీలో రాధికా శరత్‌కుమార్, సంపత్‌రాజ్, విష్ణు వినయ్ కీలక పాత్రలో నటించారు. గిరీష్ ఫణిక్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
ఆస్కార్ నామినేటెడ్ రీమేక్...
ది గాంబినోస్ మూవీ 2019లో థియేటర్లలో రిలీజైంది. హాలీవుడ్ ఆస్కార్ నామినేట్ మూవీ యానిమల్ కింగ్‌డమ్ ఆధారంగా దర్శకుడు ఈ మలయాళ సినిమాను తెరకెక్కించాడు. ప్రతిభావంతుడైన యాక్టర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది గాంబినోస్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
లేడీ గ్యాంగ్‌స్టర్...
ది గాంబినోస్ మూవీలో రాధిక శరత్‌కుమార్ లేడీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించింది. ఆమె క్యారెక్టర్ మాత్రం మలయాళ ఆడియెన్స్‌ను మెప్పించింది. ది గాంబినోస్ మూవీకి మెకానిక్ రాకీ ఫేమ్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు.
ది గాంబినోస్ కథ ఇదే...
మరియమ్మ అలియాస్ మామ్మ కేరళలోనే పెద్ద గ్యాంగ్‌స్టర్. డ్రగ్స్, హవాలా వ్యాపారాలు చేస్తుంటుంది. మరియమ్మకు నలుగురు కొడుకులు ఉంటారు. మరియమ్మ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో నలుగురు అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలవుతాయి. అనుకోకుండా ఆ ఫ్యామిలీలోకి ముస్తాఫా ఎంటర్ అవుతాడు.
మరియమ్మ ఫ్యామిలీకి ముస్తాఫాకు ఉన్న సంబంధం ఏమిటి? ముస్తఫాను చంపాలని నలుగురు అన్నదమ్ములు ఎందుకు అనుకున్నారు? కేరళలోనే పెద్ద డ్రగ్ డీలర్‌గా నిలవాలని అనుకున్న ఆ అన్నదమ్ముల ప్లాన్ సక్సెస్ అయ్యిందా? మరియమ్మ క్రైమ్ దందాకు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఎలా చెక్ పెట్టాడు అన్నదే ఈ మూవీ కథ.
బెస్ట్ విలన్...
ది గాంబినోస్ మూవీలో కీలక పాత్రలో నటించిన సంపత్‌రాజ్ యాక్టర్‌గా తెలుగు సినిమాతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ మిర్చి మూవీతో బెస్ట్ విలన్‌గా నంది అవార్డు అందుకున్నాడు. ఎఫ్3, యశోద, బ్రహ్మా ఆనందం, రాజా ది గ్రేట్, బీష్మతో పాటు తెలుగులో పలు సినిమాలు చేశాడు.
మరోవైపు విష్ణు వినయ్ యాక్టర్‌గా, డైరెక్టర్‌గా మలయాళంలో పలు సినిమాలు చేశాడు. ది గాంబినోస్‌తో పాటు ఆకాశ గంగ 2, హిస్టరీ ఆఫ్ జాయ్ సినిమాల్లో హీరోగా నటించాడు. గత ఏడాది రిలీజైన ఆనంద్ శ్రీబాల సినిమాకు దర్శకత్వం వహించాడు.ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది రాధికా శరత్‌కుమార్. గత ఏడాది హిందీలో మేర్రీ క్రిస్మస్, తెలుగులో ఆపరేషన్ రావన్ సినిమాలు చేసింది.
సంబంధిత కథనం