OTT Crime Thriller: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్-malayalam crime action thriller officer on duty ott streaming on netflix getting positive response trending top on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్

OTT Crime Thriller: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్

OTT Crime Thriller: ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీలోనూ సూపర్ ఓపెనింగ్ దక్కించుకుంది. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.

OTT Crime Thriller: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌కు సూపర్ రెస్పాన్స్.. ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లో టాప్

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ సత్తాచాటుటోంది. కుంచకో బోబన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బంపర్ హిట్ అయింది. తెలుగులోనూ మార్చి 14న విడుదలైంది. ట్విస్టులు, గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా అదిరే రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

సూపర్ రెస్పాన్స్

ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఈ శుక్రవారం (మార్చి 21) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఎంగేజింగ్‍గా, ఆసక్తికరంగా సాగిందని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఉండే ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్, స్క్రీన్‍ప్లే అదిరిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో రైటింగ్ అదిరిపోయిందని, అంతే ఇంట్రెస్టింగ్‍గా తెరకెక్కించారని రాసుకొస్తున్నారు. తప్పకుండా చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్ అంటూ పోస్టులు చేస్తున్నారు. నటీనటుల పర్ఫార్మెన్స్, జేక్స్ బెజోయ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మెప్పించిందని అంటున్నారు. మొత్తంగా డైరెక్టర్ జితూ అష్రఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా సూపర్ టాక్ తెచ్చుకుంటోంది.

ట్రెండింగ్‍లో టాప్

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వ్యూస్ భారీగా వస్తున్నాయి. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చిన ఒక్క రోజులోనే నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల్లో టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది. ఈ మూవీపై మంచి హైప్ ఉండడం, ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రావటంతో వ్యూస్‍లో దుమ్మురేపుతోంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం థియేటర్లలోనూ దుమ్మురేపింది. కేరళలో అదిరిపోయే కలెక్షన్లను దక్కించుకుంది. దాదాపు రూ.12కోట్లతో ఈ చిత్రం రూపొందింది. రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి ఈ మూవీ బ్లాక్‍బస్టర్ సాధించింది. తెలుగులో థియేటర్లలో ఈ మూవీ మార్చి 14న విడులదలైంది. అయితే, అందుకువారంలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీలో విశాఖ్ నాయర్, జగదీశ్, మీనాక్షి అనూప్, విష్ణు వారియర్, లేలా మమ్మెన్ కీరోల్స్ చేశారు. ఈ మూవీని మార్టిన్ రకత్ ఫిల్మ్స్ నిర్మించగా.. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం