OTT Comedy Thriller: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..-malayalam comedy thriller ponman trending top on jiohotstar ott streaming basil joseph ponman in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Thriller: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

OTT Comedy Thriller: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

OTT Comedy Thriller: పొన్‍మ్యాన్ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍లోనూ సత్తాచాటుతోంది. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది.

OTT Comedy Thriller: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

మరో మలయాళ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషిచించిన పొన్‍మ్యాన్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. జనవరి 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఓటీటీలో ఐదు భాషల్లో వచ్చిన ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా భారీ వ్యూస్ సాధిస్తోంది. దీంతో పొన్‍మ్యాన్ మూవీ ట్రెండింగ్‍లోకి వచ్చేసింది.

పొన్‍మ్యాన్ మూవీ మార్చి 14న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

ట్రెండింగ్‍లో తొలి స్థానం

పొన్‍మ్యాన్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీ ట్రెండింగ్‍లో దూసుకొచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. తొలి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి ఆరంభం నుంచి మంచి వ్యూస్ లభిస్తున్నాయి. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే జియోహాట్‍స్టార్ ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

పాజిటివ్ రెస్పాన్స్

మలయాళంలో పొన్‍మ్యాన్ మూవీ థియేట్రికల్ రన్‍లో సక్సెస్ సాధించింది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా ఈ మూవీపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. స్టోరీ, ఈ చిత్రాన్ని దర్శకుడు జోతిష్ శంకర్ తెరకెక్కించిన విధానం మెప్పిస్తోందంటూ రాసుకొస్తున్నారు. ఈ మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్ వస్తోంది.

బంగారు నగల చుట్టూ..

ఓ అమ్మాయి పెళ్లి కోసం ఇచ్చిన బంగారు నగలను రికవరీ చేసుకునేందుకు ఓ గోల్డ్ సేల్స్ ఏజెంట్ చేసే ప్రయత్నాల చుట్టూ పొన్‍మ్యాన్ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి జీఆర్ ఇందుగోపన్, జస్టిన్ మాథ్యూ స్టోరీ ఇవ్వగా.. జోతిష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సామాజిక పరిస్థితులను కూడా డైరెక్టర్ చక్కగా చూపించారు. మూవీలోనే అంతర్లీనంగా సమాజంలోని చాలా విషయాలను ప్రస్తావించారు. కామెడీ కూడా మెప్పిస్తుంది.

పొన్‍మ్యాన్ సినిమా దాదాపు రూ.3కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. ఈ చిత్రం సుమారు రూ.10కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయింది. అజిత్ వినాయక ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేట్రికల్ జోరుగా సాగింది. కమర్షియల్ హిట్ సాధించింది. ఇప్పుడు జియోహాట్‍స్టార్ ఓటీటీలోనూ ఈ మూవీ అదరగొడుతోంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం