OTT Comedy Thriller: ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత కన్ఫమ్ చేసిన ప్లాట్‌ఫామ్-malayalam comedy thriller movie ed extra decent ott release date sooraj venjaramoodu movie to stream on sana play ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Thriller: ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత కన్ఫమ్ చేసిన ప్లాట్‌ఫామ్

OTT Comedy Thriller: ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత కన్ఫమ్ చేసిన ప్లాట్‌ఫామ్

Hari Prasad S HT Telugu

OTT Comedy Thriller: మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ పై అప్డేట్ ఇచ్చింది. ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు సక్సెస్ సాధించింది.

ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్.. నాలుగు నెలల తర్వాత కన్ఫమ్ చేసిన ప్లాట్‌ఫామ్

OTT Comedy Thriller: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ (ED Extra Decent). ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కు ముందు డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. అయితే ఇప్పటి వరకూ డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి తాజాగా దీనిపై ఓ అప్డేట్ వచ్చింది.

ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ ఓటీటీ

ప్రముఖ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్. ఈ సినిమాను సనా ప్లే (Sana Play) ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. అయితే స్ట్రీమింగ్ తేదీపై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

నాలుగు నెలలుగా ఈ సినిమాను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకోలేదు. ఇప్పుడు ఆ హక్కులు తమకు దక్కినట్లు సనా ప్లే తెలిపింది. ఈ సినిమాలో సూరజ్ తోపాటు గ్రేస్ ఆంటోనీ, శ్యామ్ మోహన్ నటించారు.

ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీ ఏంటంటే?

ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీని ఆమిర్ పల్లిక్కల్ డైరెక్ట్ చేశాడు. బిను అనే ఓ మధ్య వయసు వ్యక్తి చుట్టూ తిరిగే సినిమా ఇది. అతడు తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. డీసెంట్ అనుకున్న తన కుటుంబం గురించి అతనికి కొన్ని చీకటి రహస్యాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీ కథ. ఇందులో బిను దాస్ పాత్రలో సూరజ్ నటించాడు. ఇక గ్రేస్ ఆంటోనీ అతని సోదరిగా కనిపించింది. ప్రేమలు మూవీ ఫేమ్ శ్యామ్ మోహన్.. ఇందులో సంజు అనే పాత్రలో నటించాడు.

గతేడాది క్రిస్మస్ సందర్భంగా మార్కో మూవీతో కలిసి ఈ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ కూడా థియేటర్లలో రిలీజైంది. సినిమాలో సూరజ్ నటనకు మంచి మార్కులు పడినా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. మార్కోతోపాటు రైఫిల్ క్లబ్ లాంటి సినిమాల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పుడీ ఈడీ ఎక్ట్స్రా డీసెంట్ మూవీ ఈ నెలలోనే సనా ప్లే ఓటీటీలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే డిజిటల్ ప్రీమియర్ అవనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం