మలయాళం కామెడీ డ్రామా మూవీ మధుర మనోహర మోహం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.
మధుర మనోహర మోహం మూవీలో షరాఫ్ ఉద్దీన్, రజీషా విజయన్, బిందు పణిక్కర్, సైజు కురుప్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టెఫీ జేవియర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మధుర మనోహర మోహం మూవీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదు కోట్ల లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందిన ఈ మూవీ పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
షరాఫ్ ఉద్దీన్, రజీషా విజయన్ యాక్టింగ్‌తో పాటు టెక్నికల్‌గా బెస్ట్ మూవీ అంటూ ప్రశంసలు వినిపించాయి. కుల, మతాల పేరుతో సొసైటీలో నెలకొన్న వివక్షను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వినోదాత్మకంగా డైరెక్టర్ ఈ మూవీలో చూపించారు. షాకింగ్ క్లైమాక్స్‌తో ఈ సినిమాను ఎండ్ చేయడం ఆకట్టుకుంది . ఈ మలయాళం సినిమాకు విజయ్ దేవరకొండ ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు.
మను ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతడికి మీరా, మలు అనే చెల్లెళ్లు ఉంటారు. తండ్రి చిన్నతనంలోనే దూరం కావడంతో తల్లి ఉషమ్మ కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేస్తుంది. శలబ అనే అమ్మాయిని మను ఇష్టపడతాడు. ఇద్దరికి పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయిస్తారు. మీరా...జేమ్స్ అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది.
కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు ఉషమ్మ ఒప్పుకోదు. మరోవైపు చెల్లెలి ప్రేమ కారణంగా మను పెళ్లికి అడ్డంకులు ఎదురవుతాయి. అదే టైమ్‌లో మీరా జీవితంలో జేమ్స్ మాత్రమే కాకుండా విష్ణు, మహేష్ అనే మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురిలో మీరా ఎవరిని పెళ్లిచేసుకుంది? తాను ఇష్టపడ్డ అమ్మాయితో మను పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మలయాళ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించిన రజీషా విజయన్ తమిళంలో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. కర్ణన్, మలయాన్‌కుంజు, సర్దార్ తో పాటు పలు సినిమాల్లో అసమాన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీలో ఓ కథానాయికగా కనిపించింది. ఆమె చేసిన ఒకే ఒక తెలుగు మూవీ ఇదే కావడం గమనార్హం. జై భీమ్, ఖోఖోతో పాటు మలయాళం, తమిళ భాషల్లో ఆమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.
సంబంధిత కథనం