ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాకా ఎన్నో రకాల సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. పదళ్ల కాలం నాటి సినిమాలు సైతం ఓటీటీల్లో అలరిస్తున్నారు. అయితే, కొన్ని మూవీస్ మాత్రం ఏ ఓటీటీల్లోనూ అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఒక మలయాళ బోల్డ్ సినిమా గురించే మనం మాట్లాడుకునేది.
ఆ మూవీనే పరంకిమాల. మలయాళంలో బోల్డ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా పరంకిమాల మూవీ తెరకెక్కింది. రొమాంటిక్, కిస్సింగ్ వంటి బోల్డ్ సీన్స్ చాలానే ఈ సినిమాలో ఉన్నాయి. అంతేకాకుండా పెద్దలు మాత్రమే చూసేవిధంగా ఆ అడల్ట్ సీన్స్ గాఢత ఎక్కువగానే ఉంటుంది. కారణాలు తెలియదు కాని పరంకిమాల ఓటీటీ స్ట్రీమింగ్‌కు అయితే నోచుకోలేదు.
సెన్నన్ పల్లస్సెరి దర్శకత్వం వహించిన పరంకిమాల సినిమాకు అఫ్జల్ యూసఫ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో వినుత లాల్, బియాన్, కళాభవన్ మని, జగదీశ్, ఇంద్రన్స్, కళారంజిని, గీతా విజయన్, తార కల్యాణ్ వంటి పాపులర్ మలయాళ నటీనటులు యాక్ట్ చేశారు. 1981లో వచ్చిన పరంకిమాల సినిమాకు రీమేక్‌గా 2014లో అదే టైటిల్‌తో రిలీజ్ చేశారు.
కానీ, 2014లో వచ్చిన పరంకిమాల మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుంది. 2014 మార్చి 21న మలయాళ థియేటర్లలో విడుదలైన పరంకిమాల ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. కానీ, యూట్యూబ్‌లో మాత్రం అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో మలయాళం, హిందీ, తెలుగు వంటి మూడు భాషల్లో పరంకిమాల స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే, డిఫరెంట్ యూట్యూబ్ ఛానెల్స్‌లలో వివిధ భాషల్లో పరంకిమాల సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. ఇక పరంకిమాల కథ విషయానికొస్తే.. హీరో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలు ఒప్పుకోరు. దాంతో లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వీరి చుట్టూనే పరంకిమాల సినిమా కథ నడుస్తుంది.
అప్పు, తంక ఇద్దరు ప్రేమించుకుంటారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ, ఈ క్రమంలో అదే ఊరిలోని సారాయి వ్యాపారి వేణు తంకను బలవంతంగా తీసుకుని వెళ్లిపోతాడు. తంక కోసం అప్పు రాత్రంతా ఎదురుచూస్తాడు. తంక ఎంతకీ రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు అప్పు. తర్వాత తంక ఎవరితోనో లేచిపోయిందని ప్రచారం జోరుగా అందుకుంటుంది.
మరోవైపు తంకను బలవంతంగా వేణు అనుభవిస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోకుండానే భర్తగా ప్రవర్తిస్తుంటాడు. అంతేకాకుండా అతని దగ్గరి పని వాళ్లు తంకంను రేప్ చేస్తారు. తంకం గురించి అప్పుకు తెలుస్తుందా? చివరికి తంకం పరిస్థితి ఏమైంది? అసలు అప్పు, వేణుకు ఉన్న గొడవ ఏంటీ? తంకంను వేణు ఎందుకు తీసుకెళ్లాడు? అనే విషయాలు తెలియాలంటే యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న పరంకిమాల మూవీని చూడాల్సిందే.
సంబంధిత కథనం