Malayalam OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం రొమాంటిక్ మూవీ - ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే
Malayalam OTT: మలయాళం రొమాంటిక్ మూవీ లవ్ 4 సేల్ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ మూవీలో సునీల్, బాలాజీ, కొట్టయాం రమేష్, వైగా రోజ్ కీలక పాత్రలు పోషించారు. రాజు జోసెఫ్ దర్శకత్వం వహించాడు.

Malayalam OTT: మలయాళం మూవీ లవ్ ఫర్ సేల్ ఓటీటీలోకి వచ్చింది ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మలయాళం మూవీలో , సునీల్, బాలాజీ, కొట్టయాం రమేష్, వైగా రోజ్ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఫర్ సేల్ మూవీకి రాజు జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
రివేంజ్ లవ్ డ్రామా...
రొమాంటిక్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు లవ్ 4 సేల్ మూవీని తెరకెక్కించాడు. ప్రేమ పేరుతో ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ మోసం చేస్తాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బును దోచేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తన స్నేహితురాలి సాయంతో మోసగాడిపై ఆ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన పరిచయం ఎలా ప్రేమగా మారింది అన్నదే లవ్ 4 సేల్ మూవీ కాన్సెప్ట్.
బోల్డ్ అంశాలతో...
తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను బోల్డ్ అంశాలతో చూపించాడు. అంతర్లీనంగా ఓ మెసేజ్‌ను చూపించాడు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ మూవీని తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపాడు. రొమాంటిక్ సీన్స్‌తోనే ఈ మూవీ ట్రైలర్‌ను కట్ చేశారు.
తొలుత లవ్ ఫర్ సేల్ మూవీ థియేటర్లలోనే రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు థియేటర్లను స్కిప్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. యూట్యూబ్‌లోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
మలయాళంలో...
లవ్ ఫర్ సేల్‌లో కీలక పాత్ర పోషించిన సునీల్ మలయాళంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్నాడు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో రెండు వందలకుపైగా సినిమాలు చేశాడు. కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించాడు. డైరెక్టర్ రాజు జోసెఫ్ గతంలో నియోగం, డాలర్‌తో పాటు మరికొన్ని మలయాళ సినిమాలు చేశాడు. ఈ సినిమాలో నటించిన వైగా రోజ్, కొట్టాయం రమేష్ కూడా మలయాళం ప్రేక్షకులకు సుపరిచితులే.
సంబంధిత కథనం