Kho Kho Telugu OTT: మలయాళం అవార్డ్ విన్నింగ్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది - ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Kho Kho Telugu OTT: రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ రజిషా విజయన్ ప్రధాన పాత్రలో నటించి మలయాళం మూవీ ఖోఖో ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జూలై 25న విడుదల కానున్న ఈ మూవీలో మమితా బైజు మరో హీరోయిన్‌గా నటించింది.
Kho Kho Telugu OTT: మలయాళం హిట్ మూవీ ఖోఖో ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్పోర్ట్స్ డ్రామా మూవీలో ప్రేమలు ఫేమ్ మమితాబైజుతో పాటు రజిషా విజయన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఖోఖో గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో జూలై 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.ఖోఖో సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించాడు.

మలయాళంలో రికార్డ్....
2021లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. రజిషా విజయన్, మమితా బైజు నాచురల్ యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించడమే కాకుండా పలు అవార్డులను అందుకున్నారు. బుల్లితెరపై రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను ఖోఖో మూవీ సొంతం చేసుకున్నది. ఖోఖో ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు 12.7 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఖోఖో నిలిచింది.
ఖో ఖో మూవీ కథ ఇదే...
ఫ్రాన్సిస్ మారియా (రజిషా విజయన్) కొత్తగా పెళ్లవుతుంది. భర్త చాలీచాలనీ జీతం కారణంగా కుటుంబం గడవటం కష్టమవుతుంది. ఇష్టంలేకపోయినా మరో దారిలేక ఓ స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఫ్రాన్సిస్ మారియా జాయినవుతుంది.
ఆ ఉద్యోగం కారణంగా ఫ్రాన్సిస్ మారియా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఖోఖో గేమ్స్‌లో మారియా స్కూల్ టీమ్ నేషనల్స్ పోటీలకు ఎలా వెళ్లింది? ఫ్రాన్సిస్ మారియాను మొదట ద్వేషించిన ఖోఖో టీమ్ కెప్టెన్ అంజు (మమితా బైజు) ఆ తర్వాత ఆమెకు ఏ విధంగా ఆత్మీయురాలిగా మారింది? ఖోఖో టీమ్ మేనేజర్ కారణంగా ఫ్రాన్సిస్ మారియా, అంజు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నదే ఈ మూవీ కథ.
సందేశంతో...
ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీలో ఖోఖో టీమ్ కెప్టెన్ పాత్రలో మమితా బైజు కనిపించింది. పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యతనివ్వాలని, ముఖ్యంగా ఆడపిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే దిశగా తల్లిదండ్రులతో పాటు గురువులు ప్రోత్సహించాలనే సందేశంతో దర్శకుడు రాహుల్ రిజి నాయర్ ఈ మూవీని తెరకెక్కించారు. మహిళా క్రీడాకారులకు ఎదురయ్యే అడ్డంకులు, అవరోధాలతో ఈ మూవీలో టచ్ చేశారు.
టీవీ హోస్ట్ నుంచి హీరోయిన్....
మలయాళంలో టీవీ హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది రజిషా విజయన్. పలు మ్యూజిక్ షోలకు యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత అనురాగ కరికిన్ వెళ్లాం అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రజిషా విజయన్ తొలి మూవీతోనే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నది. మలయాళంలో ఫైనల్స్, స్టాండప్, ఫ్రీడమ్ ఫైట్, కీడమ్, మలయాన్‌కుంజు, కొల్లంతో పాటు పలు సినిమాలు చేసింది.
రవితేజ మూవీతో...
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రజిషా విజయన్. యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.
తమిళంలో ధనుష్ కర్ణన్, సూర్య జై భీమ్‌తో పాటు మరికొన్ని అవార్డ్ విన్నింగ్ సినిమాలు చేసింది. గ్లామర్‌కు దూరంగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది. ప్రేమలు సూపర్ హిట్ తో యూత్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారింది మమితా బైజు. కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 136 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.