OTT Mystery Crime Thriller: అఫీషియల్.. ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ.. డేట్ ఇదే
OTT Mystery Crime Thriller: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేఖాచిత్రం’ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఆసిఫ్ అలీ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు రానుంది. ఎప్పుడు, ఏ ఓటీటీలోకి ఈ చిత్రం స్ట్రీమింగ్కు వస్తుందంటే..

మలయాళ మూవీ ‘రేఖాచిత్రం’ సూపర్ హిట్ అయింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు కమర్షియల్గానూ సక్సెస్ అయింది. జనవరి 9న ఈ మూవీ మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. ఈ రేఖాచిత్రం మూవీ ఎప్పడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
రేఖాచిత్రం సినిమా మార్చి 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ నేడు (ఫిబ్రవరి 15) అధికారికంగా వెల్లడించింది. “ఓ మరిచిపోయిన నేరం. పాతిపెట్టిన నిజం. అన్నింటినీ బయటికి తీసే సమయం వచ్చింది. మార్చి 7 నుంచి సోనీలివ్లో రేఖాచిత్రం” అని ఆ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
రేఖాచిత్రం మూవీ మార్చి 7న ఐదు భాషల్లో సోనీ లివ్లో అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడలోనూ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు ఆ ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ చేసింది. థియేటర్లలో మలయాళంలో ఒక్కటే రిలీజైన రేఖాచిత్రం చిత్రం ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తోంది.
రేఖాచిత్రం మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. రెండు టైమ్లైన్లలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మిస్టరీ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ.. సీఐ వివేక్ గోపీనాథ్ పాత్ర పోషించారు. అనస్వర రాజన్.. రేఖా పాత్రోస్ క్యారెక్టర్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి క్యామియో రోల్లో కనిపించారు. సిద్ధిఖీ, జగదీశ్, మనోజ్ కే జయన్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్, ఇంద్రన్స్, సలీమా కీరోల్స్ చేశారు.
సూపర్ హిట్
రేఖాచిత్రం సినిమా సుమారు రూ.55కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.6కోట్ల బడ్జెట్తో రూపొందిందని అంచనా. ఈ చిత్రం మొదటి నుంచి పాజిటివ్ టాక్తో అదరగొట్టింది. ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్బస్టర్ అయింది. థియేటర్లలో విడుదలైన సుమారు రెండు నెలల తర్వాత మార్చి 7న సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది.
రేఖాచిత్రం మూవీని కావ్య ఫిల్మ్ కార్పొరేషన్, అన్ మెగా మీడియా పతాకాలపై వేణు కున్నప్పిలి నిర్మించారు. ఈ చిత్రానికి ముజీబ్ మజీద్ సంగీతం అందించగా.. అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ చేశారు. ఓ ఆత్మహత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. 40 క్రితం జరిగిన క్రైమ్తో దానికి సంబంధం ఉంటుంది. ఈ కేసుల విచారణ చుట్టు రేఖాచిత్రం మూవీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది.
సోనీలివ్లో ‘మార్కో’ స్ట్రీమింగ్
మలయాళ బ్లాక్బస్టర్ మూవీ ‘మార్కో’ ఈ వారంలోనే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 20న మలయాళంలో థియేటర్లలో రిలీజైన మార్కో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తెలుగులోనూ విడుదలైంది. మొత్తంగా ఈ చిత్రం రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. మార్కో మూవీకి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం