సెట్స్‌లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ న‌టి ఫిర్యాదు?-malayalam actress vincy files complaint against co actor for misbehaving in movie sets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సెట్స్‌లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ న‌టి ఫిర్యాదు?

సెట్స్‌లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ న‌టి ఫిర్యాదు?

Nelki Naresh HT Telugu

ఒక సహ నటుడు ఓ మూవీ సెట్స్‌లో త‌న‌ను లైంగికంగా వేధించాడంటూ మ‌ల‌యాళ న‌టి విన్సీ ఆలోషియ‌స్ ఆరోపించారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌తో పాటు కేర‌ళ ఫిలిం ఛాంబ‌ర్‌లో విన్సీ ఆలోషియ‌స్ ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన నటి (ప్రతీకాత్మక చిత్రం)

సూత్ర‌వాక్యం అనే సినిమా సెట్స్‌లో తన సహ నటుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా లైంగికంగా వేధింపుల‌క‌కు గురిచేశాడంటూ మ‌ల‌యాళ న‌టి విన్సీ అలోషియ‌న్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌లో ఫిర్యాదు చేశారని సమాచారం. ఆమె ఆరోప‌ణ‌లు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారాయి. కేర‌ళ ఫిలిం ఛాంబ‌ర్‌లోనూ విన్సీ అలోషియ‌స్ ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ...

కేర‌ళ‌లో నిర్వ‌హించిన డ్ర‌గ్స్ అవేర్‌నెస్ క్యాంప్‌లో విన్సీ అలోషియ‌న్ పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా సూత్ర‌వాక్యం సినిమా సెట్స్‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని వివ‌రించింది. తాజాగా మ‌రోసారి ఈ ఆరోప‌ణ‌ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోలో ఎక్క‌డ సహ నటుడి పేరును విన్సీ ఆలోషియ‌న్ వెల్ల‌డించ‌లేదు.

సూత్ర‌వాక్యం సెట్స్‌...

సూత్ర‌వాక్యం సినిమా సెట్స్‌లో ఓ స‌హ‌న‌టుడు త‌న దుస్తులు స‌ర్ధుతున్న‌ట్లుగా న‌టిస్తూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, లైంగికంగా వేధింపుల‌కు గురిచేశాడ‌ని ఈ వీడియోలో పేర్కొన్న‌ది. తెల్ల‌టి పౌడ‌ర్ లాంటి ప‌దార్థాన్నిఆ న‌టుడు ఉమ్మివేయ‌డం చూసిన త‌ర్వాతే అత‌డు డ్ర‌గ్స్ వాడుతున్న విష‌యం అర్థ‌మైంద‌ని విన్సీ ఈ వీడియోలో పేర్కొన్న‌ది.

ఈ భ‌యాన‌క సంఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చాలా కాలం ప‌ట్టింద‌ని విన్సీ ఆలోషియ‌న్ చెప్పింది. మ‌రోసారి డ్ర‌గ్స్ వినియోగించే న‌టుల‌తో ప‌నిచేయ‌కూడద‌ని ఈ సంఘ‌ట‌న త‌ర్వాత బ‌లంగా నిర్ణ‌యించుకున్నాన‌ని విన్సీ తెలిపింది.

నార్కోటిక్ దాడుల నుంచి నటుడి ఎస్కేప్‌

కొచ్చిలోని ప్ర‌ముఖ హోట‌ల్‌పై బుధ‌వారం నార్కొటిక్ టీమ్ దాడి చేసింది. నార్కోటిక్ బృందం హోట‌ల్‌కు రావ‌డానికి కొద్ది నిమిషాల ముందు మళయాల నటుడు షైన్ టామ్ చాకో హోట‌ల్ నుంచి పారిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. థ‌ర్డ్ ఫ్లోర్‌లో ఉన్న త‌న రూమ్ కిటికీ గుండా సెకండ్ ఫ్లోర్‌లోకి దూకి... అక్క‌డి నుంచి మెట్ల ద్వారా షైన్ టామ్ చాకో హోట‌ల్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.

ఇందుకు సంబంధించిన ఆధారాలు నార్కోటిక్ టీమ్‌కు దొరికిన‌ట్లు స‌మాచారం. రైడ్‌కు సంబంధించి టామ్ చాకోకు స‌మాచారం అంద‌డంతోనే అత‌డు పారిపోయిన‌ట్లు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

2015లో షైన్ టామ్ చాకోకు చెందిన ఫ్లాట్‌లో పోలీసులు కోకైన్ ప‌ట్టుకున్నారు. టామ్ చాకోపై కేసును న‌మోదు చేశారు. ప‌దేళ్ల త‌ర్వాత ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.

ద‌స‌రా మూవీతో...

ద‌స‌రా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. దేవ‌ర, రాబిన్‌హుడ్‌, రంగ‌బ‌లితో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. మ‌ల‌యాళంలో టాప్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు. కాగా మ‌ల‌యాళ న‌టి విన్సీ అలోషియ‌న్ ఆరోపణలు చేసింది ఈ నటుడిపైనేనంటూ పలు వార్తాపత్రికలు కథనాలు రాశాయి.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం