Paradha: తెలుగులోకి మలయాళ హీరోయిన్ ఎంట్రీ.. అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేయలేనిదంటూ!-malayalam actress darshana rajendran first look poster from paradha and anupama parameswaran sangeetha lead roles ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Paradha: తెలుగులోకి మలయాళ హీరోయిన్ ఎంట్రీ.. అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేయలేనిదంటూ!

Paradha: తెలుగులోకి మలయాళ హీరోయిన్ ఎంట్రీ.. అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేయలేనిదంటూ!

Sanjiv Kumar HT Telugu
Jun 18, 2024 11:47 AM IST

Paradha Darshana Rajendran First Look Poster: మలయాళంలో చాలా పాపులర్ అయిన హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న దర్శన రాజేంద్ర ఫస్ట్ లుక్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

తెలుగులోకి మలయాళ హీరోయిన్ ఎంట్రీ.. అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేయలేనిదంటూ!
తెలుగులోకి మలయాళ హీరోయిన్ ఎంట్రీ.. అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేయలేనిదంటూ!

Malayalam Heroine Telugu Entry: "సినిమా బండి" సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రం 'పరదా'తో మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెరీ టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా తన తొలి ప్రొడక్షన్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు.

'హృదయం', 'జయ జయ జయ జయ హే' వంటి మలయాళ హిట్ సినిమాలతో పాపులరైన సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. దర్శన రాజేంద్రన్ బర్త్ డే సందర్భంగా విషెస్ అందించిన మేకర్స్ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ "అమిష్ట"గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దర్శనను సివిల్ ఇంజనీర్ ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది.

మేకర్స్ షేర్ చేసిన స్పెషల్ వీడియోలో దర్శన రాజేంద్రన్‌ను 'అమిష్ట' క్యారెక్టర్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ప్రజెంట్ చేశారు. వీడియో చివరిలో 'అబ్బాయిలు చేయలేనిది, అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం' అంటూ దర్శన చెప్పిన డైలాగ్ కథ, క్యారెక్టర్‌పై చాలా క్యురియాసిటీని పెంచింది. విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. దర్శన రాజేంద్రన్ అద్భుతమైన పెర్ఫార్మర్. ఇందులో పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండే పాత్ర అని తెలుస్తోంది.

దర్శన రాజేంద్రన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడారు. "మేము సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసినందుకు నేను థ్రిల్‌గా ఉన్నాం. కష్టానికి ప్రాణం పోసే క్షణం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ప్రవీణ్ కాండ్రేగుల చెప్పారు.

నిర్మాత విజయ్ డొంకాడ మాట్లాడుతూ.. "మేము విడుదలకు ఒక స్టెప్ దగ్గరగా వెళుతున్నప్పుడు మేము క్రియేట్ చేసిన వరల్డ్‌ని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎదరుచూస్తున్నాం. చాలా పాషన్‌తో ఈ సినిమా చేశాం. పరదా ఆడియన్స్‌పై శాశ్వత ముద్ర వేసుకుంటుదని నమ్మకంగా ఉన్నాం" అని తెలిపారు.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. త్వరలో సినిమా విడుదల తేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈలోపు సినిమా నుంచి ఎగ్జయిటింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నారు.

ఇందులో బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుపమ టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో ముద్దు సీన్లతో అట్రాక్ట్ చేసింది. ఏ సినిమాలో నటించనంత బోల్డ్‌గా యాక్ట్ చేసింది అనుపమ పరమేశ్వరన్.

Whats_app_banner