OTT Malayalam Action Thrillers: ఓటీటీలో ఉన్న టాప్ 6 మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
OTT Malayalam Action Thrillers: ఓటీటీలో ఉన్న మలయాళం మూవీస్ లో థ్రిల్లర్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ జానర్ మూవీస్ చేయడంలో వాళ్లు ధిట్ట. మరి మలయాళం నుంచి వచ్చిన టాప్ 6 యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఒకసారి చూడండి.
OTT Malayalam Action Thrillers: మలయాళ సినిమా నిజంగా యాక్షన్ థ్రిల్లర్స్ విషయంలో తన సత్తా చూపించింది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్ నటించిన బ్రూటల్ మూవీ మార్కో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసింది. ఆ తర్వాత జోజు జార్జ్ డైరెక్ట్ చేసిన పని, మమ్ముట్టి నటించిన టర్బో కూడా యాక్షన్‌లో జోరు చూపించాయి. అలా ఉన్ని ముకుందన్ "మార్కో" నుంచి టోవినో థామస్ "ఐడెంటిటీ" వరకు ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 మలయాళం యాక్షన్ థ్రిల్లర్స్ ఏవో ఇక్కడ చూడండి.
మార్కో – సోనీలివ్
ఉన్ని ముకుందన్ తన కెరీర్‌లోనే అత్యంత బ్రూటల్ అవతార్‌ని స్క్రీన్‌పై చూపించాడు. మలయాళంలో ఇప్పటివరకూ వచ్చిన అత్యంత వైలెంట్ యాక్షన్ మూవీగా దీన్ని చెప్పొచ్చు. హనీఫ్ అదేని డైరెక్షన్‌లో ఈ మూవీ వచ్చింది. అంధుడైన తన అన్న విక్టర్ చనిపోయిన తర్వాత మార్కో చేసే హత్యల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. సిద్ధిక్, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్, అభిమన్యు శమ్మి తిలకన్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ మూవీ సోనీలివ్ ఓటీటీలో ఉంది.
పని – సోనీలివ్
జోజు జార్జ్ డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టిన పని మూవీ కూడా వైలెంట్ రివెంజ్ థ్రిల్లరే. త్రిసూర్ క్రిమినల్ వరల్డ్‌లోకి వెళ్లిన ఇద్దరు యువకులను గిరి అనే గ్యాంగ్‌స్టర్ కొడతాడు. తన భార్యను ఓ సూపర్ మార్కెట్లో అసభ్యకరంగా తాకడంతో అతడిలా చేస్తాడు. దీంతో అప్పటి నుంచీ అతనితోపాటు అతని కుటుంబం, సన్నిహితులు లక్ష్యంగా ఆ ఇద్దరు యువకులు చెలరేగిపోతారు. వాళ్లపై గిరి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ.
టర్బో – సోనీలివ్
మమ్ముట్టి "టర్బో" జోస్‌గా ఈ సినిమాని లీడ్ చేశాడు. వైశాఖ్ డైరెక్షన్‌లో, మిథున్ మాన్యుయల్ థామస్ రాసిన ఈ సినిమాలో, చెన్నైలో ఉద్యోగం కోసం వెతుకుతున్న జోస్ ఒక క్రూరమైన కింగ్‌మేకర్‌ని ఎదుర్కొంటాడు. రాజ్ బి శెట్టి విలన్‌గా నటించిన ఈ థ్రిల్లర్ యాక్షన్‌లో ఫుల్ జోష్ చూపిస్తుంది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.
ఐడెంటిటీ – జీ5
టోవినో థామస్ నటించిన మూవీ ఐడెంటిటీ. త్రిష కృష్ణన్, వినయ్ రాయ్ కూడా కీలక పాత్రలు పోషించారు. స్కెచ్ ఆర్టిస్ట్ హరన్, ఒక కిల్లర్‌ని పట్టుకోవడానికి పోలీసులకి హెల్ప్ చేస్తాడు. ఆ కేసులో అలీషా ఒక్కతే సాక్షిగా ఉంటుంది. ఆ కిల్లర్ ఎవరు? పోలీసులు పట్టుకున్నారా లేదా అన్నదే మూవీ కథ. కార్ చేజ్, కమర్షియల్ ఫ్లైట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఈ సినిమాలో ఉన్నాయి. మంచి థ్రిల్ పంచే ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది.
అజగజంతరం – సోనీలివ్
ఆంటోనీ వర్గీస్ పెప్పే నటించిన "అజగజంతరం" కేరళ గ్రామంలోని పూరం (టెంపుల్ ఫెస్టివల్)లో జరిగే గందరగోళ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. కొంతమంది యువకులు, ఒక క్రిమినల్, గ్రామస్థులు అంతా అందులో ఇరుక్కుంటారు. అర్జున్ అశోకన్, జాఫర్ ఇడుక్కి, సబుమోన్ కూడా ఈ సినిమాలో నటించారు. దీన్ని టిను పప్పచన్ డైరెక్ట్ చేశాడు. సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు.
భీష్మపర్వం - జియోహాట్‌స్టార్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన మూవీ భీష్మ పర్వం. కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ శక్తివంతమైన కుటుంబ పెద్దగా ఇందులో మమ్ముట్టి కనిపిస్తాడు. మంచి యాక్షన్, థ్రిల్ పంచే ఈ మూవీని జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం