మరో ఓటీటీలోకి మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘మురా’ (Mura) రాబోతుంది. హృదయు హరూన్ తొలి మలయాళ చిత్రం మురా త్వరలోనే మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి పలు భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మురా మూవీ మరో ఓటీటీలోకి వస్తుంది. ఆగస్టు 29 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మహ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా 2024 నవంబర్లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమా డిసెంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టు 29న అర్ధరాత్రి 12 గంటల నుంచి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మురా సినిమా థియేటర్లో సత్తాచాటింది. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. చాలా మంది కొత్త నటీనటులు నటించినప్పటికీ ఈ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది 50 రోజుల విజయవంతమైన థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. మాలా పార్వతి, జోబిన్ దాస్, అనుజిత్ కన్నన్, ఏదు కృష్ణ, విఘ్నేశ్వర్ సురేష్, కన్నన్ నాయర్, క్రిష్ హసన్, సిబి జోసెఫ్, కని కుశ్రుతితో పాటు పలువురు కొత్త నటులు ఈ చిత్రంలో నటించారు. సూరజ్ కాస్త నిగూఢమైన పాత్రలో కనిపించగా, ప్రేక్షకులు మెచ్చుకున్నారు.
కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని నలుగురు యువకుల కథే ఈ చిత్రం. నలుగురు నిరుద్యోగ యువకులు ఓ పని ఒప్పుకొన్న తర్వాత ఏం జరిగిందన్నది సస్పెన్స్ పంచుతుంది. ఒక పనికి అంగీకరించిన తరువాత నలుగురు నిరుద్యోగ యువకుల జీవితాలు చీకటి మలుపులు తిరుగుతాయి. ఇది వారి జీవితాలను శాశ్వతంగా ఎలా మారుస్తుంది అనేది మురా సారాంశం.
సురేష్ బాబు ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. క్రిస్టీ జోబీ సంగీతం అందించగా, చమన్ చాకో ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఫాజిల్ నాజర్ సినిమాటోగ్రాఫర్. యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునే ఓటీటీ ఫ్యాన్స్ కు ఈ మూవీ మంచి ఆప్షన్.
ఆగస్టు 29న మురా మినహా మరే మలయాళ సినిమాలు ఓటీటీలోకి రావట్లేదు. అయితే మళయాళ వెబ్ సిరీస్ కమ్మట్టం మాత్రం అదే రోజు జీ5 ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ ఆరు ఎపిసోడ్ల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో సుదేవ్ నాయర్ పోలీస్ పాత్రలో నటించారు.
సంబంధిత కథనం