OTT Action Thriller: తెలుగులోకి వచ్చిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?
OTT Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మురా తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు, హృదు హరున్ కీలక పాత్రలో నటించారు.
OTT Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మురా తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
నేషనల్ అవార్డ్ విన్నర్...
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడు, హృదు హరూన్ లీడ్ రోల్స్‌లో నటించారు. మాలా పార్వతి, కని కస్తూరి, క్రిష్ హాసన్, జోబిన్ దాస్ కీలక పాత్రలు పోషించారు.మురా మూవీకి సురేశ్ బాబు కథ అందించగా.. మహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించాడు.
డిజాస్టర్...
రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మురా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా...కథ, కథనాలు రొటీన్‌గా ఉండటంతో మురా మూవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.
నెగెటివ్ క్యారెక్టర్‌లో సూరజ్ వెంజరమూడు తన నటనతో ఆకట్టుకున్నాడు. ట్విస్ట్‌లు చాలా వరకు ప్రెడిక్టబుల్‌గా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్‌గా మారింది. మురా కంటే ముందు కప్పేలా సినిమాను తెరకెక్కించాడు మహమ్మద్ ముస్తాఫా. కప్పేలా మూవీ తెలుగులో బుట్టబొమ్మగా రీమేక్ కావడం గమనార్హం.
మురా కథ ఇదే..
ఆనందు (హృదు హరూన్), మనూ (యధు కృష్ణన్), మనాఫ్ (అనుజిత్), సాజి (జోబిన్ దాస్) నలుగురు ప్రాణ స్నేహితులు. రౌడీలుగా మారాలని కలలు కంటారు. అని (సూరజ్ వెంజరమూడు) అనే గ్యాంగ్‌స్టర్ దగ్గర పనిలో చేరతారు. ఓ చోట దాచిన వందల కోట్ల బ్లాక్‌మనీని నలుగురు స్నేహితల చేత దొంగిలించాలని అని స్కెచ్ వేస్తాడు. డబ్బుకు ఆశపడి నలుగురు స్నేహితులు దొంగతనం చేయడానికి ఒప్పుకుంటారు.
దొంగనతం కోసం బయలుదేరిన నలుగురికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ బ్లాక్ మనీ ఎవరిది? నలుగురు స్నేహితులకు అని ఎలాంటి ద్రోహం చేశాడు? అని చేసిన మోసానికి నలుగురు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
తమిళం, మలయాళంలో...
హృదు హరున్ గతంలో తమిళంలో థగ్స్, ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాల్లో కీలక పాత్రలు పోసించాడు. సూరజ్ వెంజరమూడు మలయాళంలో 250కిపైగా సినిమాలు చేశాడు.