Killer Movie: గుప్పెడంత మనసు జగతి కిల్లర్ మూవీ నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్- షూటింగ్ అప్‌డేట్ రివీల్!
Killer Movie: గుప్పెడంత మనసు జగతి హీరోయిన్‌గా నటిస్తోన్న కిల్లర్ మూవీ నుంచి మేకర్స్ రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో జ్యోతిరాయ్ నుదుటిపై ఓ వ్యక్తి ముద్దుపెడుతూ కనిపిస్తోన్నాడు. కిల్లర్ మూవీలో జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ హీరోగా నటిస్తున్నాడు.
Killer Movie: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్‌గా తెలుగులో ఓ మూవీ చేస్తోంది. కిల్లర్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తోన్నాడు.ఈ సినిమాలో అతడే హీరోగా నటిస్తోన్నాడు.
రొమాంటిక్ పోస్టర్...
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఆదివారం మేకర్స్ రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో జ్యోతిరాయ్ నుదుటిపై ఓ వ్యక్తి ముద్దుపెడుతూ కనిపిస్తోన్నాడు. సేమ్ లుక్‌తో రిలీజ్ చేసిన మరో పోస్టర్‌లో రోబోగా జ్యోతిరాయ్ కనిపించింది.
సెకండ్ షెడ్యూల్ ప్రారంభం...
కిల్లర్ మూవీలో రోబోగా, మోడ్రన్ యువతిగా రెండు డిఫరెంట్ లుక్‌లలో జ్యోతిరాయ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. సోమవారం నుంచి కిల్లర్ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభంకానున్నట్లు ప్రకటించారు.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
కిల్లర్ సినిమా టైటిల్ కింద ఉన్న సూపర్ షీ అనే క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. ఈ కిల్లర్ మూవీతోనే సుకు పూర్వజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. హీరో, డైరెక్టర్‌గానే కాకుండా ప్రజయ్ కామత్, పద్మనాభరెడ్డితో కలిసి సుకు పూర్వజ్ కిల్లర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తూన్నాడు.గతంలో దర్శకుడిగా మాటరాని మౌనమిది, శుక్ర అనే సినిమాలు చేశాడు సుకు పూర్వజ్. అతడు దర్శకత్వం వహించిన ఏ మాస్టర్ పీస్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో జ్యోతిరాయ్ ఓ కీలక పాత్ర పోషించింది.
మాస్టర్ పీస్ షూటింగ్‌లోనే...
ఏ మాస్టర్ పీస్ షూటింగ్ జరుగుతోండగానే సుకు పూర్వజ్‌తో ప్రేమలో పడ్డ జ్యోతిరాయ్ అతడిని పెళ్లి చేసుకున్నది. పెళ్లి తర్వాత తన పేరును జ్యోతి పూర్వజ్‌గా మార్చుకుంది.
గుప్పెడంత మనసు జగతి...
జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటించిన గుప్పెడంత మనసు సీరియల్ ఈ ఏడాది ఆగస్ట్‌లో ముగిసింది. ఫ్యామిలీ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్‌లో జగతి పాత్రలో జ్యోతిరాయ్ కనిపించింది. కొడుకుకు దూరమై అతడి ప్రేమ కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో జ్యోతిరాయ్ యాక్టింగ్‌తో అదరగొట్టింది. గుప్పెడంత మనసు సీరియల్ జ్యోతిరాయ్‌కి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.
వెబ్‌సిరీస్...
గుప్పెడంత మనసు కంటే ముందు తెలుగులో కన్యాదానం సీరియల్ చేసింది. కన్నడంలో పదిహేనుకుపైగా సీరియల్స్‌లో నటించింది. కన్నడంలో దియా, సప్లయర్ శంకర, జెర్సీ నంబర్ 10తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది జ్యోతిరాయ్.