Devara Daavudi Song: దేవర సినిమాకు దావూదీ పాటను యాడ్ చేయనున్నారా?
Devara Movie - Daavudi Song: దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ అందుకున్నా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఎన్టీఆర్ యాక్షన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తున్న తరుణంలో ఓ పాటను యాడ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య గత శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే ఓపెనింగ్‍తో బాక్సాఫీస్‍ను ఫస్ట్ డే షేక్ చేసింది. ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. విడుదలకు ముందు ఫుల్ హైప్ ఇచ్చిన ‘దావూదీ’ పాట దేవర చిత్రంలో లేకపోవటంతో కొందరు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తోంది.
పాట యాడ్ చేసే ప్లాన్.. ఎప్పటి నుంచి?
దేవర చిత్రానికి డ్యుయెట్ సాంగ్ ‘దావుదీ’ని యాడ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారనే సమాచారం బయటికి వచ్చింది. ఈ శుక్రవారం రోజు నుంచి థియేటర్లలో ఈ పాటను కూడా ప్రదర్శించనున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వెల్లడైంది. మూవీ సెకండ్ హాఫ్‍లో ఈ పాటను జోడిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హైప్ ఉన్నా ఎందుకు తీసేశారు?
దేవర చిత్రంలో దావూదీ పాటపై మంచి హైప్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించిన సగం వీడియోను రిలీజ్‍కు ముందే మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీశారు. మొత్తం సాంగ్ ఇంకా అదిరిపోతుందని మూవీ టీమ్ చెప్పింది. దీంతో ప్రేక్షకులు బాగా అంచనాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే దేవరలో దావూదీ సాంగ్ కనిపించలేదు. ఇది కొందరిని నిరాశపరిచింది.
దేవర మూవీలో ఎక్కడ దావూదీ పాటను పెట్టాలో అర్థం కాక మేకర్స్ తీసేశారని తెలుస్తోంది. సెకండ్ హాఫ్‍లో జాన్వీ కపూర్ ఉన్నదే కాసేపు. అందులోనూ ‘చుట్టమల్లే’ సాంగ్ ఉంది. ఇంకో పాట పెట్టే స్కోప్ లేదు. అయితే, ఈ పాటను ఎండ్ టైటిల్ కార్డ్స్ తర్వాత ఉంచాలని కూడా మేకర్స్ ఆలోచించారని తెలిసింది. అయితే, అలా చేస్తే క్లైమాక్స్ ఎమోషన్, ట్విస్ట్ ప్రభావం ప్రేక్షకులపై తగ్గుతుందని అనుకున్నారు. దీంతో దావూదీ పాటను లేపేశారు.
అయితే, ప్రేక్షకుల నుంచి ఆ పాట ఉండాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు యాడ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మరి.. సెకండ్ హాఫ్‍లో ఈ పాటను ఎక్కడ యాడ్ చేస్తారో చూడాలి.
దేవర మూవీని హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సులు మెప్పించినా.. స్క్రీన్‍ప్లే విషయంలో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‍లో తన మాస్ యాక్షన్‍తో, యాక్టింగ్ వేరియేషన్లతో అదరగొట్టారు. ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఈ మూవీని కమర్షియల్‍గానూ సక్సెస్ చేస్తోంది.
దేవర చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.350కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేయగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేశారు. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, కలైయారాసన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు.