Allu Arjun: వైరల్ అవుతున్న మహేష్ బాబు పాత ట్వీట్.. అవార్డు మిస్ చేసుకున్నాడా అంటూ కామెంట్స్-mahesh babus old tweet going viral after allu arjun wins national award ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: వైరల్ అవుతున్న మహేష్ బాబు పాత ట్వీట్.. అవార్డు మిస్ చేసుకున్నాడా అంటూ కామెంట్స్

Allu Arjun: వైరల్ అవుతున్న మహేష్ బాబు పాత ట్వీట్.. అవార్డు మిస్ చేసుకున్నాడా అంటూ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Aug 25, 2023 08:21 AM IST

Allu Arjun: మహేష్ బాబు పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత మహేష్ ఈ అవార్డు మిస్ చేసుకున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

పుష్ప మూవీలో అల్లు అర్జున్
పుష్ప మూవీలో అల్లు అర్జున్ (Twitter)

Allu Arjun: నేషనల్ అవార్డు గెలిచి అల్లు అర్జున్ చరిత్ర సృష్టించిన విషయం తెలుసు కదా. పుష్ప: ది రైజ్ మూవీలో అతడు పోషించిన పాత్రకుగాను బెస్ట్ యాక్టర్ అవార్డు అతన్ని వరించింది. దీనిని బన్నీ తన ఫ్యామిలీ, పుష్ప టీమ్ తో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కేక్ కూడా కట్ చేశాడు. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఓ పాత ట్వీట్ వైరల్ అవుతోంది.

అసలు ఈ అవార్డు అతనికి రావాల్సిందేమో.. అనవసరంగా మిస్ చేసుకున్నాడా అంటూ పలువురు అభిమానులు ఆ ట్వీట్ పై కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తో కాస్త క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు మహేష్ చేసిన ట్వీట్ అది. ఏప్రిల్ 3, 2019లో మహేష్ ఆ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పుష్ప మూవీనే మహేష్ మిస్ చేసుకున్నట్లు చాలా మంది ఫిక్సయ్యారు.

కానీ అది నిజం కాదు. పుష్ప షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే మహేష్ ఈ ట్వీట్ చేయడంతో అతడు ఈ ప్రాజెక్ట్ నే మిస్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే అసలు నిజం మాత్రం వేరే ఉంది. అదే సమయానికి సుకుమార్ ఓ కథతో మహేస్ బాబును కలిశాడు. అంతకు రెండేళ్ల ముందు మహేష్ తోనే వన్ నేనొక్కడినే అనే సినిమా సుకుమార్ తీశాడు.

నిజానికి మూవీ చాలా ఇంట్రెస్టింగానే ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 2019లో మరోసారి ఇంకో కథతో సుకుమార్ మహేష్ దగ్గరికి వెళ్లాడు. కానీ దానికి అతడు అంగీకరించలేదు. అదే విషయాన్ని అప్పుడే ఓ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప మూవీ షూటింగ్ ప్రారంభించాడు.

కానీ మహేష్ కు సుకుమార్ వినిపించిన కథ పుష్పది కాదు. అది పూర్తిగా వేరే కథ. ఒకవేళ ఆ ఇద్దరూ కలిసి సినిమా చేసినా.. అది పుష్ప అయి ఉండేది కాదు. ఇది తెలియక చాలా మంది నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీనే మహేష్ దూరం చేసుకున్నాడా అంటూ ఆ పాత ట్వీట్ వైరల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేసుకున్న ప్రాజెక్టులు తర్వాత సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

పుష్ప విషయంలోనూ మహేష్ అలాగే చేశాడేమో అన్నది అభిమానుల భావన. ఇక పుష్ప విషయానికి వస్తే తొలి పార్ట్ లో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పుష్ప పాత్రలో అతడు జీవించేశాడు. ఇప్పుడు పుష్ప ది రూల్ తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Whats_app_banner