Murari Re-release: మురారి రీ-రిలీజ్ క్రేజ్.. ఆహ్వాన పత్రిక రెడీ చేసిన ఫ్యాన్స్: వీడియో
Murari Re-release: మురారి సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. సుమారు 23 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన క్లాసిక్ మూవీ ‘మురారి’ థియేటర్లలోకి మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతోంది. మహేశ్ కెరీర్లో ఈ చిత్రం చాలా స్పెషల్‍గా నిలిచింది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా 2001లో విడుదలైంది. ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా సోనాలి బింద్రే నటించారు. వారిద్దరి నటన ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులను ఈ మూవీ బాగా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు, 23 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. రీ-రిలీజ్‍కు రెడీ అయింది.
మహేశ్ పుట్టిన రోజున..
మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమా ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ క్లాసిక్ చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు మహేశ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రన్‍టైమ్ తగ్గించి..
మురారి మూవీ రీ-రిలీజ్ కోసం మేకర్స్ రన్‍టైమ్‍ను తగ్గించారు. సుమారు 18 నిమిషాల నిడివిని ట్రిమ్ చేయనున్నారు. 2 గంటల 42 నిమిషాల రన్‍టైమ్‍తో ఆగస్టు 9వ తేదీన మురారి మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది.
రీ-రిలీజ్‍కు ఆహ్వాన పత్రికలు
మురారి సినిమా రీ-రిలీజ్ అవుతుండటంతో మహేశ్ బాబు అభిమానులు ఫుల్ జోష్‍లో ఉన్నారు. ఇంకా 20 రోజుల సమయం ఉన్నా అప్పుడే సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టేశారు. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం కొందరు ఓ వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల పేర్లయిన మురారి, వసుంధర పెళ్లి అంటూ కార్డ్ తయారు చేశారు. మహేశ్ బాబు, సోనాలి ఫొటోలను కూడా ప్రింట్ చేశారు. ఆగస్టు 9న ముహూర్తం అంటూ రాశారు. అలాగే, ఘట్టమనేని వారి వివాహం అంటూ ఆ పత్రికలో ప్రింట్ చేశారు. మహేశ్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ ఆహ్వానిస్తున్నారంటూ ఆ పత్రికలో పేర్కొన్నారు.
మురారి రీ-రిలీజ్ కోసం ఫ్యాన్స్ తయారు చేసిన ఈ పెళ్లి ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ తరహాలోనే మరికొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో బయటికి వస్తున్నాయి. మొత్తంగా మురారి రీ-రిలీజ్‍కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థమవుతోంది.
మురారి చిత్రం 2001 ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణ వంశీ. కామెడీ, కుటుంబ బంధాలు, ఎమోషన్లు ఇలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. దేవుడి శాపం అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు, సోనాలీ హీరోహీరోయిన్లుగా నటించగా.. లక్ష్మి, సుకుమారి, కైకాల సత్యనారాయణ, మారుతీరావు, అన్నపూర్ణ, సుధ, ప్రసాద్ బాబు, శివాజీ రాజా, రవిబాబు, రఘుబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మహేశ్ దగ్గరయ్యారు.
మురారి చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం కూడా చాలా బలంగా నిలిచింది. ఈ చిత్రాన్ని రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై దేవీ ప్రసాద్, రామలింగేశ్వర రావు, గోపీ నందిగం నిర్మించారు.
మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.