మహేష్ బాబు మరదలికి కొవిడ్ పాజిటివ్.. మళ్లీ మొదలైన కరోనా భయం.. మాస్కులు వేసుకోవాలంటూ..-mahesh babu sister in law bigg boss 18 contestant shilpa shirodkar tested covid positive suggests people to wear mask ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మహేష్ బాబు మరదలికి కొవిడ్ పాజిటివ్.. మళ్లీ మొదలైన కరోనా భయం.. మాస్కులు వేసుకోవాలంటూ..

మహేష్ బాబు మరదలికి కొవిడ్ పాజిటివ్.. మళ్లీ మొదలైన కరోనా భయం.. మాస్కులు వేసుకోవాలంటూ..

Hari Prasad S HT Telugu

మహేష్ బాబు మరదలు, నటి నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కొవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని సోమవారం (మే 19) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు అందరినీ మాస్కులు వేసుకోవాల్సిందిగా సూచిస్తోంది.

మహేష్ బాబు మరదలికి కొవిడ్ పాజిటివ్.. మళ్లీ మొదలైన కరోనా భయం.. మాస్కులు వేసుకోవాలంటూ..

కొవిడ్ మళ్లీ మెల్లగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ నటి, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లిన స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ కు కూడా కొవిడ్ సోకిన విషయం తెలిసిందే. ఈ మధ్యే బిగ్ బాస్ 18లో పాల్గొన్న శిల్ప.. తనకు కొవిడ్ వచ్చిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్

శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరదలు అవుతుంది. అతని భార్య నమ్రతా శిరోద్కర్ కు ఆమె చెల్లెలు. తనకు కొవిడ్ సోకిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. మాస్కులు వేసుకోవాల్సిందిగా సూచించింది. “అందరికీ నమస్కారం.. నేను కొవిడ్ పాజిటివ్ గా తేలాను. జాగ్రత్తగా ఉండండి. మాస్కులు వేసుకోండి” అని సూచించింది.

ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేస్తూ కామెంట్స్ చేశారు. గెట్ వెల్ సూన్, గెట్ వెల్ శిల్పా మేడమ్.. అంటూ కొందరు ఫ్యాన్స్ ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు. చాలా రోజులుగా పత్తా లేకుండా పోయిన కొవిడ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

ఎవరీ శిల్పా శిరోద్కర్?

శిల్పా శిరోద్కర్ నటి, మోడల్ కూడా. 1990ల్లో హిందీ సినిమాల్లో నటించింది. 2000లో నటనకు గుడ్ బై చెప్పిన ఆమె.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ 2013లో వచ్చిన ఏక్ ముట్టీ ఆస్మాన్ సినిమాలో నటించింది. ఆ తర్వాత గతేడాది బిగ్ బాస్ 18 సీజన్ లో పార్టిసిపేట్ చేసింది.

2000లో పెళ్లి చేసుకున్న ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. ఆమె అక్క, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్.. మహేష్ బాబును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిల్పా ఆ తర్వాత ఏకంగా 14 కిలోల బరువు తగ్గి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం