Mahesh Babu Rajamouli Movie Update: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత మహేష్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు అగ్ర దర్శకుడు రాజమౌళి.ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో మహేష్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి చాలా సందర్భాల్లో తెలిపాడు. ,ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నాడు. వరల్డ్ వైడ్ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్‌గా మహేష్‌బాబు సినిమాను రూపొందించనున్నట్లు రాజమౌళి వెల్లడించాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్‌ను రచయిత విజయేంద్రప్రసాద్ రివీల్ చేశాడు. మహేష్‌బాబు - రాజమౌళి సినిమాను ఫ్రాంచైజ్ మాదిరిగా డెవలప్ చేయనున్నట్లు తెలిపాడు. ,ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్‌ను కొనసాగిస్తూ సీక్వెల్స్ రూపొందించనున్నట్లు అన్నాడు. ఈ సీక్వెల్స్ అన్నింటిలోనే మహేష్‌బాబు హీరోగా కనిపిస్తాడని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నాడు., ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పాడు. మహేష్‌బాబు, రాజమౌళి సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 29వ సినిమా ఇది.,ఈ సినిమా కోసం మహేష్‌బాబు ఏడాది పాటు డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్‌బాబు. జనవరిలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మూడు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.