Okkadu Re Release First Day Collection: మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఒక్కడు సినిమా రీ రిలీజ్‌లోనూ (Okkadu Re Release ) అదరగొట్టింది. తొలి రోజు రెండు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. రీ రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఒక్కడు రిలీజై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమాను మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ,మొదటిరోజు ఈ సినిమా అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకున్నది. రెండు కోట్ల పది లక్షల గ్రాస్‌ను రాబట్టింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఒక్కడు సినిమా 95 లక్షల గ్రాస్‌ను రాబట్టడం గమనార్హం. సీడెడ్‌లో 20 లక్షలు, ఆంధ్రాలో 80 లక్షల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో 15 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ,ఓవరాల్‌గా మొదటిరోజు ఈ సినిమా రెండు కోట్ల పది లక్షల గ్రాస్, 95 లక్షల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రీ రిలీజ్ కలెక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా సినిమాలు టాప్ ప్లేస్‌లో నిలిచాయి. ,ఖుషి సినిమా తొలిరోజు 3.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, జల్సా సినిమా 2 కోట్ల 50 లక్షల గ్రాస్ రాబట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత ఒక్కడు మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో కోటి యాభై లక్షలతో పోకిరి నాలుగో ప్లేస్‌లో నిలిచింది. ,కాగా ఒక్కడు సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. భూమిక హీరోయిన్‌గా నటించింది. 2003లో రిలీజైన ఒక్కడు ఎనిమిది నంది అవార్డులను సొంతం చేసుకున్నది. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నలభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.