Mahesh Babu Okkadu Re Release: మహేష్ బాబు ఒక్కడు ఎన్ని థియేటర్లలో రీ రిలీజ్ కానుందంటే
Mahesh Babu Okkadu Re Release: మహేష్‌బాబు ఒక్కడు సినిమా శనివారం (నేడు) రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదల కానుందంటే...
Mahesh Babu Okkadu Re Release: మహేష్‌బాబు ఒక్కడు సినిమా శనివారం (నేడు) మరోసారి థియేటర్ల ద్వారా అభిమానుల ముందుకు రాబోతున్నది. మహేష్‌బాబు కెరీర్‌లో ఒక్కడు సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
ఇరవై ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా మహేష్‌బాబు కు యూత్‌లో భారీగా ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. కబడ్డీ నేపథ్యానికి రాయలసీమ ఫ్యాక్షనిజం, ప్రేమకథను జోడించి దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఎనిమిది నంది అవార్డులను దక్కించుకున్నది.
ఇందులో మహేష్‌బాబు యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శనివారం (నేడు)ఒక్కడు థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 250 నుంచి 300 థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్‌లోనే వందకుపైగా థియేటర్లలో ఒక్కడు రీ రిలీజ్ అవుతోన్నట్లు సమాచారం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండు మెయిన్ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సిటీలోని పలు మల్టీప్లెక్స్‌లలో తొలిరోజు ఏడుకుపైగా షోలు స్క్రీనింగ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు.
సంక్రాంతి వరకు థియేటర్లలో ఒక్కడు ఈ సినిమాను ఆడించబోతున్నట్లు సమాచారం. ఒక్కడు రీ రిలీజ్ కలెక్షన్స్ ఫస్ట్ డే కోటి రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మహేష్‌బాబు పోకిరి గత ఏడాది రీ రిలీజ్ అయ్యింది. తొలిరోజు ఈ సినిమా 69 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఆ రికార్డ్‌ను ఒక్కడు అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రీ రిలీజ్ కలెక్షన్స్‌లో కోటి అరవై ఐదు లక్షలతో పవన్ కళ్యాణ్ ఖుషి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కాగా ఒక్కడు సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించాడు.