Mahesh Babu in Sankranthi Race: సంక్రాంతి బరిలో మహేష్ - చిరు, బాలయ్య కంటే ముందే వస్తున్నాడు
Mahesh Babu in Sankranthi Race: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి పోటీ ఆసక్తికరంగా మారింది. తాజాగా సంక్రాంతి రేసులోకి మహేష్ చేరాడు. సంక్రాంతికి ఒక వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏదంటే...
Mahesh Babu in Sankranthi Race: మహేష్‌బాబుకు అచ్చొచ్చిన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతికి రిలీజైన మహేష్ సినిమాలు భారీ బ్టాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. మరోసారి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేష్‌బాబు. అయితే కొత్త సినిమాతో కాదు. ఒక్కడు రీ రిలీజ్‌తో సంక్రాంతి రేసులోకి వచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు
మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు సినిమా 2023 జనవరి 7న రీ రిలీజ్ కానుంది. ఒక్కడు విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో స్పెషల్ షోస్ ప్రదర్శించబోతున్నారు.. తొలుత ఈ సినిమాను జనవరి 8న రీ రిలీజ్ చేయాలని భావించారు.
తాజాగా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఒక్కడు రీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో మహేష్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 2003 సంక్రాంతి కానుకగా జనవరి 15న ఒక్కడు రిలీజైంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆ సమయంలో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఒక్కడు నిలిచింది.
ఎనిమిది నంది అవార్డులను అందుకున్నది. ఇందులో అజయ్ వర్మ అనే కబడ్డీ ప్లేయర్‌గా మహేష్‌బాబు తన నటనతో అభిమానులను మెప్పించారు. మహేష్‌కు జోడీగా భూమిక హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్ విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం మహేష్‌బాబు దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే రాజమౌళితో ఓ సినిమాను అంగీకరించారు