Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల-mahesh babu new look in long hair sister manjula pokes pun at him video gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu New Look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Hari Prasad S HT Telugu
Published Apr 29, 2024 03:00 PM IST

Mahesh Babu new look: సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పెళ్లి వేడుకకు తన లాంగ్ హెయిర్ లో వచ్చాడు. అతన్ని చూసి అక్క మంజుల సరదాగా ఆటపట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల
పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Mahesh Babu new look: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సినిమాల కోసం కొత్త కొత్త లుక్స్ లో కనిపిస్తున్నాడు. టాలీవుడ్ అందగాడిగా పేరుగాంచిన మహేష్.. ఈ మధ్య ఇలా డిఫరెంట్ లుక్స్ తోనూ అట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా లాంగ్ హెయిర్ లో అతడు కనిపిస్తున్నాడు. ఈ మధ్యే ఓ పెళ్లి వేడుకకు అతడిలా పొడవాటి జుట్టుతో వచ్చాడు.

మహేష్ జట్టు పట్టుకొని..

ఈ పెళ్లి వేడుకకు వచ్చిన మహేష్ బాబును అతని అక్క మంజుల సరదాగా ఆట పట్టించింది. అతని జులపాల జుట్టును పట్టుకుంటూ ఇదేంటంటూ గట్టిగా నవ్వేసింది. అది చూసి మహేష్ కూడా తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు అతడు తన భార్య నమత్రా, కూతురు సితారతో కలిసి వచ్చాడు. హైదరాబాద్ లో ఈ పెళ్లి జరిగింది.

ప్రస్తుతం మహేష్ తన నెక్ట్స్ మూవీ ఎస్ఎస్ రాజమౌళితో చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా అంటే ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో వచ్చే ఏడాది మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం ఉంటుందో లేదో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇక తాజాగా జరిగిన పెళ్లి వేడుకలో తన అక్క మంజులతోపాటు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవితోనూ మహేష్ ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని వెంటే వచ్చిన కూతురు సితార కూడా తన క్యూట్ లుక్స్ తో ఆకర్షించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. ఈ పెళ్లికి సాంప్రదాయ దుస్తుల్లో హాజరైంది.

నెక్ట్స్ మూవీ కోసమేనా?

మహేష్ బాబు ఈ కొత్త లుక్ తన నెక్ట్స్ మూవీ కోసమేనా అన్న చర్చ మొదలైంది. ఇండియానా జోన్స్ స్టైల్లో రాజమౌళితో మహేష్ మూవీ ఉండనుందని ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా కోసం అతడు తన లుక్ మార్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29గా పిలుస్తున్నారు.

మహేష్ కెరీర్లో ఇది 29వ సినిమాగా రాబోతోంది. ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించనున్నారు. మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నట్లు ఈ మధ్యే రాజమౌళి కూడా చెప్పాడు. అయితే మూవీ గురించి పెద్దగా వివరాలేమీ వెల్లడించలేదు. తన సినిమాలను చాలా వరకూ సీక్రెట్ గా మెయింటేన్ చేయడం రాజమౌళికి అలవాటు.

అంతేకాదు ఒక్కో సినిమాకు కొన్నేళ్ల సమయం కూడా తీసుకుంటాడు. ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లయిపోయినా.. ఇప్పటి వరకూ మరో మూవీ మొదలు పెట్టలేదు. ఇప్పుడు మహేష్ తో సినిమాకు ఎంత టైమ్ పడుతుందో ఇంకా చెప్పలేదు. అయితే కనీసం రెండేళ్లయితే గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఆ లెక్కన 2026 లేదంటే ఆ తర్వాతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Whats_app_banner