Ashok Galla Second Movie: మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో మ‌హేష్ మేన‌ల్లుడి రెండో సినిమా - వెంక‌టేష్ చేతుల మీదుగా మొద‌లు-mahesh babu nephew ashok galla second movie begins today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu Nephew Ashok Galla Second Movie Begins Today

Ashok Galla Second Movie: మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో మ‌హేష్ మేన‌ల్లుడి రెండో సినిమా - వెంక‌టేష్ చేతుల మీదుగా మొద‌లు

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2023 02:50 PM IST

Ashok Galla Second Movie: మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ కొత్త సినిమా ఆదివారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు వెంక‌టేష్‌తో పాటు మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.

వెంక‌టేష్‌, అశోక్ గ‌ల్లా
వెంక‌టేష్‌, అశోక్ గ‌ల్లా

Ashok Galla Second Movie: హీరో సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా. గ‌త ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ను ద‌క్కించుకున్న‌ది.

ఏడాది గ్యాప్ త‌ర్వాత రెండో సినిమాను మొద‌లుపెట్టాడు అశోక్ గ‌ల్లా. అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ కొత్త నిమా ఆదివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న‌ ఈ సినిమాకు ఆ!, జాంబీరెడ్డి ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.

తొలి సినిమాకు భిన్నంగా మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో అశోక్ గల్లా రెండో సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు టాలీవుడ్ స్టార్ హీరో వెంక‌టేష్‌తో పాటు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, మ‌హేష్‌బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ హాజ‌ర‌య్యారు.

ద‌ర్శ‌కుడిగా అర్జున్ జంధ్యాల‌కు ఇది రెండో సినిమా. గ‌తంలో కార్తికేయ గుమ్మ‌కొండ‌తో గుణ 369 అనే సినిమా చేశాడు అర్జున్ జంధ్యాల‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

మ‌హేష్‌బాబు సోద‌రి ప‌ద్మావ‌తి, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్‌. అమెరికాలో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్న అత‌డు మామ‌య్య బాట‌లోనే సినిమాల్లోకి వ‌చ్చాడు

IPL_Entry_Point

టాపిక్