Murari Re Release Collection: రీ రిలీజ్ సినిమాల్లో మురారి రికార్డ్ - పవన్ తర్వాత మహేష్ మూవీనే సెకండ్
Murari Re Release Collection: మహేష్‌బాబు మురారి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రీ రిలీజ్ సినిమాల్లో టాప్ త్రీలో ఒకటిగా నిలిచింది.
Murari Re Release Collection: మహేష్‌బాబు మురారి మూవీ రీ రిలీజ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఐదున్నర కోట్లకుపైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మురారి మూవీకి ఏపీ, నైజాంలో కలిసి 2.26 కోట్ల వరకు వచ్చాయి. హైదరాబాద్‌లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మహేష్ మూవీ కోటి అరవై లక్షల వరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఓవరాల్‌గా మహేష్‌బాబు రీ రిలీజ్ సినిమాల్లో బిజినెస్‌మెన్ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా మురారి నిలిచింది. బిజినెస్‌మెన్ ఫస్ట్ డే ఐదు కోట్ల డెబ్బై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
ఖుషి మూవీ హయ్యెస్ట్...
ఇప్పటివరకు తెలుగులో రీ రిలీజైన స్టార్ హీరోల సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఖుషి 7.76 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. బిజినెస్‌మెన్ ఐదు కోట్ల తొంభై లక్షలతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. వాటి తర్వాత మూడో స్థానంలో మురారి స్థానాన్ని దక్కించుకున్నది. శనివారం రోజు కూడా మురారి అడ్వాన్స్ బుకింగ్స్ 20 లక్షలకుపైనే జరిగినట్లు సమాచారం. బిజినెస్‌మెన్ రికార్డును ఈజీగా మురారి బ్రేక్ చేస్తుందని అంటున్నారు. ఖుషి రికార్డ్‌ను మురారి చేరువ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మహేష్ కెరీర్‌లో ఫస్ట్ హిట్...
మురారి మూవీకి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. సూపర్ నాచురల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మహేష్ బాబు కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మురారి మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందించాడు. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా మురారి నిలిచింది. మురారి మూవీతోనే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్, సినిమాటోగ్రాఫర్‌గా రాంప్రసాద్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
మురారి బాక్సాఫీస్...
మురారి మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పది కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా నంది అవార్డును అందుకున్నది. మురారి మూవీకిగాను స్పెషల్ జ్యూరీ విభాగంలో మహేష్ బాబు, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లక్ష్మి నంది అవార్డులను గెలుచుకున్నారు.
గుంటూరు కారంతో…
ఈ ఏడాది గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేష్‌బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. గుంటూరు కారం మూవీ 300 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
యాక్షన్ అడ్వెంచర్ మూవీ...
ప్రస్తుతం అగ్ర దర్శకుడు రాజమౌళితో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు మహేష్‌బాబు. మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అటు ప్రొడక్షన్ హౌజ్ , ఇటు దర్శకుడు రాజమౌళి కూడా ఎలాంటి అప్‌డేట్ రివీల్ చేయకపోవడంతో ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.