Murari Re-release Box office: ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మురారి సినిమా! రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..-mahesh babu murari becomes highest grossed telugu movie in re releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Murari Re-release Box Office: ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మురారి సినిమా! రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Murari Re-release Box office: ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మురారి సినిమా! రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 11, 2024 05:46 PM IST

Murari Re-release Box office: మురారి సినిమా రీ-రిలీజ్‍లో దుమ్మురేపుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం రీ-రిలీజ్‍ల్లో ఓ ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లను ప్రకటించారు.

Murari Re-release Box office: ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మురారి సినిమా! రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Murari Re-release Box office: ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మురారి సినిమా! రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గత శుక్రవారం (ఆగస్టు 9) మురారి చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. 23 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైంది. ఈ మూవీ రీ-రిలీజ్‍కు చాలా రోజుల కిందటి నుంచి భారీ బజ్ నెలకొంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో వేచిచూశారు. అందుకు తగట్టే బుకింగ్స్ కూడా జరిగాయి. మురారి సినిమా రీ-రిలీజ్ థియేటర్లలో భారీగా సందడి నెలకొంది. ఈ క్రమంలో రెండో రోజుల్లో మురారి రీ-రిలీజ్‍లో అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టింది. రికార్డు సృష్టించింది.

రెండు రోజుల వసూళ్లు ఇవే

మురారి సినిమా రీ-రిలీజ్‍లో రెండు రోజుల్లోనే ఏకంగా రూ.7.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వసూళ్ల విషయంలో దుమ్మురేపింది. రీ-రిలీజ్ చిత్రానికి రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం విశేషమే.

ఆల్‍టైమ్ రికార్డు

మురారి రీ-రిలీజ్‍లో రెండు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.7.4 గ్రాస్ దక్కించుకొని ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసిందంటూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు రీ-రిలీజ్‍ల్లో రెండు రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న మూవీగా మురారి రికార్డు దక్కించుకుంది. అలాగే, తెలుగు రీ-రిలీజ్‍ల్లో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఖుషి (రూ.7.46 కోట్లు) సినిమా పేరిట ఉంది. దాదాపు ఈ వసూళ్లను రెండు రోజుల్లోనే మురారి సాధించింది. ఖుషిని దాటేసి టాలీవుడ్ రీ-రిలీజ్‍ల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా మురారి నిలువనుంది. రీ-రిలీజ్‍ల విషయంలో బిజినెస్ మ్యాన్ (రూ.5.8 కోట్లు)ను మురారి దాటేసింది.

థియేటర్లలో పెళ్లిళ్లు!

మురారి సినిమా రీ-రిలీజ్ సందడి థియేటర్లలో భారీగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ అభిమానులు హంగామా చేస్తున్నారు. థియేటర్లలో డ్యాన్సులు, కేకలు, విజిళ్లతో మోతమోగిస్తున్నారు. ఇక మురారి రీ-రిలీజ్ సందర్భంగా కొన్ని చోట్ల థియేటర్లలోనే కొందరు పెళ్లి చేసుకున్నారన్నట్టు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. ఈ విషయం దర్శకుడు కృష్ణవంశీ దృష్టికి కూడా వెళ్లగా.. అలా పెళ్లి చేసుకోడం సరికాదంటూ ట్వీట్ కూడా చేశారు.

మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. మహేశ్ బాబు, సోనాలి బింద్రే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. కెరీర్ తొలినాళ్లతో మహేశ్‍కు మంచి హిట్‍గా నిలిచింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలాన్ని ఇచ్చాయి.

మురారి చిత్రంలో మహేశ్, సోనాలీతో పాటు లక్ష్మి, కైకాల సత్యనారాయణ, సుకుమారి, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, సుధ, శివాజీ రాజా, రవిబాబు కీరోల్స్ చేశారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకం ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది. ఇక, ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం రీ-రిలీజ్‍లోనూ భారీ వసూళ్లను సాధిస్తోంది. మరిన్ని రోజులు జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.