Guntur Kaaram Day 6 Collection: గుంటూరు కారం కలెక్షన్స్ 72 శాతమే రికవరీ.. మహేశ్ బాబు హిట్ కొట్టాలంటే?
Guntur Kaaram Box Office Collection Day 6: మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ రూ. 100 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం డే 6 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
Guntur Kaaram 6 Days Collection: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తెలుగు చిత్రం గుంటూరు కారం బుధవారం అంటే ఆరో రోజున కలెక్షన్లు బాగా తగ్గినట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పటికీ భారతదేశంలో గుంటూరు కారం మూవీ 100 కోట్ల రూపాయల మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. అంటే నెట్ కలెక్షన్లలో గుంటూరు కారం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై సత్తా చాటింది. గుంటూరు కారం కలెక్షన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రముఖ ట్రేడ్ సంస్థ Sacnilk.com వెల్లడించింది.
Sacnilk.com లెక్కల ప్రకారం భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం గుంటూరు కారం ఇండియాలో 6వ రోజు సుమారు 7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో గుంటూరు కారం సినిమా రూ. 100.95 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు చేసినట్లయింది. ఇదే కాకుండా గుంటూరు కారం సినిమాకు ఏడో రోజున ఇప్పటివరకు అయితే రూ. 0.67 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాకు కలెక్షన్స్ రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి.
గుంటూరు కారం మూవీకి మంగళవారం అంటే ఐదో రోజున రూ. 10.95 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు రూ. 14.1 కోట్లు వచ్చాయి. నాలుగో రోజు కంటే ఐదో రోజు కలెక్షన్స్ తగ్గాయి. ఇప్పుడు ఐదో రోజు కంటే ఆరో రోజు గుంటూరు కారం కలెక్షన్స్ మరింతగా తగ్గాయి. ఐదో రోజున 10 కోట్లు వస్తే.. ఆరో రోజున 7 కోట్లే వచ్చాయి. ఇక ముందు ముందు గుంటూరు కారం కలెక్షన్స్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక గుంటూరు కారం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రూ. 76 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్, రూ. 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 7 కోట్ల కలెక్షన్స్ ఓవర్సీస్‌లో 6 రోజుల్లో రూ. 14 కోట్లకుపైగా వచ్చినట్లు సమాచారం. ఇలా గుంటూరు కారం సినిమాకు 6 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్.. రూ. 164 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు టాక్.
గుంటూరు కారం సినిమా విడుదలైన ఆరు రోజుల్లో 72 శాతం వసూల్లు రికవరీ చేసింది. అంటే సినిమాకు ఇంకా రూ. 32 కోట్లకుపైగా వసూలు చేయాల్సిందిగా తెలుస్తోంది. 32 కోట్లు వస్తేనే గుంటూరు కారం మూవీ క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
లోకల్ పొలిటిషీయన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మీనాక్షి చౌదరి, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఇటీవల గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.