Mahesh Babu Emotional: ఎమోషనల్ అయిన మహేష్ బాబు.. తండ్రి కృష్ణ కోసం మనసుకు హత్తుకునే నోట్
Mahesh Babu Emotional: మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. ఈ మధ్యే కన్ను మూసిన తన తండ్రి కృష్ణ కోసం మనసుకు హత్తుకునే ఓ నోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం (నవంబర్ 24) పోస్ట్ చేశాడు.
Mahesh Babu Emotional: మహేష్ బాబుకు 2022 ఏడాది చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ఈ ఏడాది ఏకంగా అతని కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మహేష్‌కు దూరమయ్యారు. మొదట అన్న రమేష్ బాబు, ఆ తర్వాత తల్లి ఇందిరా దేవి, ఈ మధ్యే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో మహేష్ బాగా ఎమోషనల్ అవుతున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్యంగా తల్లి మరణం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని మహేష్‌ను తండ్రి మరణం మరింత కలిచివేసింది. నవంబర్ 15వ తేదీన కన్నుమూసిన తన తండ్రి కృష్ణను గుర్తు చేసుకుంటూ గురువారం (నవంబర్ 24) మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నీ అడుగు జాడల్లోనే నడుస్తా.. నువ్వ మరింత గర్వపడేలా బతుకుతా అంటూ అతడు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
"మీ జీవితం పరిపూర్ణం. మీ మరణం తీరని లోటు. మీ జీవితం ఎంతో గొప్పది. మీరు భయం లేకుండా జీవించారు. డేరింగ్, డాషింగే మీ స్వభావం. నాకు ప్రేరణ.. నా ధైర్యం మీరు. ఇన్నాళ్లూ నేను బాగా కావాలనుకున్న వ్యక్తి మీరు. కానీ అలా వెళ్లిపోయారు. కానీ వింతగా ఇప్పుడు నాలోని శక్తిని గతంలో నేను ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు నాకు భయం లేదు. నాపై మీ చల్లని చూపులు ఎప్పటికీ ఉంటాయి. మీ అడుగు జాడల్లోనే నడుస్తాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యు నాన్నా.. నా సూపర్‌స్టార్" అంటూ మహేష్ అన్నాడు.
ఈ పోస్ట్‌కు కృష్ణ బ్లాక్ అండ్ ఫొటోను పోస్ట్ చేశాడు. నవంబర్ 15న కన్నుమూసిన కృష్ణ అంత్యక్రియలు ఆ మరుసటి రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే. అతని అస్థికలను కృష్ణా నదిలో కలిపారు.