Mahesh Babu-Sitara Ad: మహేష్ కు సితారా జెన్ జెడ్ లెసన్స్..వావ్ అన్నాచెల్లెలిలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్.. వీడియో ఇదే-mahesh babu daughter act in trends ad sitara teaching zen z words to super star video goes viral fans comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu-sitara Ad: మహేష్ కు సితారా జెన్ జెడ్ లెసన్స్..వావ్ అన్నాచెల్లెలిలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్.. వీడియో ఇదే

Mahesh Babu-Sitara Ad: మహేష్ కు సితారా జెన్ జెడ్ లెసన్స్..వావ్ అన్నాచెల్లెలిలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్.. వీడియో ఇదే

Mahesh Babu-Sitara Ad: సూపర్ స్టార్ మహేష్ బాబు కు తనయ సితారా జెనరేషన్ జెడ్ పాఠాలు నేర్పిస్తోంది. ఈ తండ్రీకూతురు కలిసి నటించిన కమర్షియల్ యాడ్ వైరల్ గా మారింది. వీళ్లు అన్నాచెల్లెలిగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

యాడ్ లో మహేష్ బాబు, సితారా

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త యాడ్ రిలీజైంది. ట్రెండ్స్ యాడ్ లో ఆయన తన కూతురు సితారాతో కలిసి యాక్ట్ చేయడం విశేషం. ఈ తండ్రీకూతురు కలిసి నటించిన కొత్త యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్లు ఫాదర్, డాటర్ లా లేరని.. అన్నాచెల్లెలిలా కనిపిస్తున్నారంటూ మహేష్ లుక్ పై ఫ్యాన్స్ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ యాడ్ లో మహేష్ కు సితారా జెన్ జెడ్ లాంగ్వేజ్ ను నేర్పిస్తూ కనిపించింది.

కొత్త యాడ్ లో అదుర్స్

మహేష్ బాబు, సితారా కలిసి చేసిన కొత్త యాడ్ అదుర్స్ అనిపిస్తోంది. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సితారా కూడా యాక్టింగ్ తో మెప్పిస్తోంది. ఇప్పటికే ఆమె ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి తో కలిసి ట్రెండీగా ట్రెండ్స్ యాడ్ లో తళుక్కుమంది. ఈ వీడియోను మహేష్, అతని భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు.

స్టైలిష్ గా

ఈ బట్టల షాపింగ్ మాల్ యాడ్ లో మహేష్, సితారా స్టైలిష్ గా కనిపించారు. షాపింగ్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన మహేష్, సితార కొత్త దుస్తులను ధరించి సంతోషంగా ఉన్నారు. ఆ వెంటనే ఒకరి తర్వాత ఒకరి డ్రెస్ లు మారుతుంటాయి. మహేష్‌కు సితారా.. డ్రిప్, వైబ్, ఫ్యామ్ వంటి జెన్ జెడ్ పదాలను నేర్పింది. దీనితో ఆయన “అంటే ఇది ఫ్యామ్-జామా?” అని అడుగుతాడు. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియో కింద నమ్రత హృదయం ఎమోజీలు పెట్టింది.

వేరే లెవల్ వైబ్

మహేష్, సితార నటించిన ఈ యాడ్ చూసి అభిమానులు సంతోషంలో తేలిపోతున్నారు. ఈ యాడ్ పోస్టు కింద కామెంట్లు చేస్తున్నారు. ఓ ఫ్యాన్ అయితే.. ‘‘ఇది తండ్రి, కుమార్తె కలిసి యాక్ట్ చేసిన యాడ్ లా లేదు. అన్నాచెల్లి యాడ్ లా ఉంది’’ అని కామెంట్ చేశాడు. మహేష్ ఇంకా యంగ్ బాయ్ లా మారిపోయాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

నటి విష్ణుప్రియ కూడా “సీతు పాపా చాలా చాలా అందంగా ఉంది” అని వ్యాఖ్యానించింది. ఒక అభిమాని.. “వీళ్లు కలిసి ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నా” అని రాసుకొచ్చాడు.

రాజామౌళి సినిమా

మహేష్ చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం చిత్రంలో యాక్ట్ చేశాడు. 2024 సంక్రాంతికి ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లు వసూలు చేసింది. మహేష్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో మూవీ చేస్తున్నారు. ఈ జంగిల్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం