Mahesh Babu Back To Sets: మ‌హేష్ బాబు బ్యాక్ టు వ‌ర్క్‌ - ఫొటో వైర‌ల్‌-mahesh babu back to the work stylish photo viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu Back To The Work Stylish Photo Viral On Social Media

Mahesh Babu Back To Sets: మ‌హేష్ బాబు బ్యాక్ టు వ‌ర్క్‌ - ఫొటో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 03, 2022 06:32 PM IST

Mahesh Babu Back To Sets:తండ్రి కృష్ణ మ‌ర‌ణం కార‌ణంగా దాదాపు ఇర‌వై రోజుల షూటింగ్‌ల‌కు గ్యాప్ ఇచ్చాడు మ‌హేష్‌బాబు. తండ్రి దూర‌మైన బాధ‌నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆయ‌న శ‌నివారం ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షూటింగ్‌కు సంబంధించి మ‌హేష్‌బాబు షేర్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారింది.

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

Mahesh Babu Back To Sets: తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణంతో గ‌త కొద్ది రోజులుగా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్న మ‌హేష్‌బాబు తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడు. దాదాపు ఇర‌వై రోజుల విరామం త‌ర్వాత ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. స్పోర్ట్స్ జాకెట్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

బ్యాక్ టు వ‌ర్క్ అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. మ‌హేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హేష్‌బాబు తిరిగి వ‌ర్క్ మొద‌లుపెట్ట‌డంతో అభిమానుల్లో ఆనందం నెల‌కొంది. గ‌త న‌వంబ‌ర్ 15న గుండెపోటు సీనియ‌ర్ హీరో కృష్ణ క‌న్నుమూశారు. ఒక్క ఏడాదిలోనే త‌ల్లిదండ్రుల‌తో పాటు సోద‌రుడు దూర‌మ‌వ్వ‌డం మ‌హేష్‌బాబు కుటుంబానికి తీర‌ని లోటుగా మారింది. ఇటీవ‌లే అభిమానుల స‌మ‌క్షంలో తండ్రి పెద్ద క‌ర్మ‌ను నిర్వ‌హించాడు మ‌హేష్‌బాబు.

తండ్రి దూర‌మైన బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మ‌హేష్‌బాబు శ‌నివారం నుంచి వ‌ర్క్ మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌బాబు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మ‌హేష్‌బాబు హీరోగా న‌టిస్తోన్న 28వ సినిమా ఇది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్రివిక్ర‌మ్ సినిమాతో పాటుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను అంగీక‌రించారు మ‌హేష్‌బాబు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.