ఈ జూలై నెలలో కూడా వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‍ల క్యూకట్టాయి. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఓటీటీ ఆడియన్స్‌ను అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో కొన్ని ముఖ్యమైన చిత్రాలు ఉన్నాయి. మహారాజ సహా మరిన్ని పాపులర్ సినిమాలు ఈనెలలో ఓటీటీల్లో అడుగుపెట్టాయి. ఈ జూలై నెలలో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ సినిమా థియేటర్లలో భారీ హిట్ అయింది. ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. మహారాజ సినిమా జూలై 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజ సినిమా థియేటర్లలో జూన్ 14న రిలీజై రూ.100కోట్లకు పైగా దక్కించుకోగా.. ఇప్పుడు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే.. తప్పకుండా చూసేయండి.
మలయాళ స్టార్ పృథ్విరాజన్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆడుజీవితం - ది గోట్‍లైఫ్’ సినిమా జూలై 19వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మార్చి 28న ఈ సర్వైవల్ డ్రామా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.150కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. పృథ్విరాజ్ సుకుమారన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌పై భారీగా ప్రశంసలు వచ్చాయి. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ ఆడుజీవితం సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత ఏకంగా 113 రోజులకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
హరోంహర సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా జూలై 15వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ మరుసటి రోజే ఈటీవీ విన్ ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ జియోసినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కెంచిన హరోంహర మూవీ జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. నెల తర్వాత ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీల్లో మంచి సక్సెస్ సాధించింది.
తెలుగు ఎమోషనల్ డ్రామా మూవీ ‘మ్యూజిక్‍షాప్ మూర్తి’ ఈటీవీ విన్ ఓటీటీలోకి జూలై 16వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఎంట్రీ ఇచ్చింది. అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఓటీటీలోనూ పాజిటివ్ స్పందన దక్కించుకుంటోంది. మ్యూజిక్‍షాప్ మూర్తి మూవీకి శివ పాలడుగు దర్శకత్వం వహించారు.
బాలీవుడ్ హీరో రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్ర పోషించిన శ్రీకాంత్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి జూలై 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. కంటిచూపు లేకపోయినా సవాళ్లను అధిగమించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు వ్యక్తి శ్రీకాంత్ బొల్లా జీవితంపై ఈ మూవీ రూపొందింది. తుషార్ హీరామండి దర్శకత్వం వహించిన ఈ బయోగ్రఫీ మూవీ మే 10న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టాపిక్