OTT Top Movie: ఓటీటీలో సత్తాచాటుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చిన బ్లాక్‍బస్టర్ చిత్రం
Maharaja OTT streaming: థియేటర్లలో భారీ హిట్ అయిన మహారాజ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఓటీటీలో అప్పుడే ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
మక్కల్ సెల్వన్, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ బ్లాక్‍బస్టర్ అయింది. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావటంతో భారీ వసూళ్లను సాధించింది. లాంగ్ రన్ దక్కించుకుంది. దీంతో రూ.110కోట్లకుపై వసూళ్లను సాధించింది. థియేటర్లలో భారీ హిట్ అయిన మహారాజ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది.

ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్
మహారాజ సినిమా గత శుక్రవారం జూలై 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ అప్పుడే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
మహారాజ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకు తగ్గట్టే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో ఇండియా ట్రెండింగ్ చిత్రాల్లో ప్రస్తుతం టాప్‍కు చేరింది. ఈ చిత్రం మరిన్ని రోజులు హవా కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఓటీటీలోనూ అదిరే రెస్పాన్స్
మహారాజ చిత్రానికి ఓటీటీలోనూ అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ అద్భుతంగా ఉందని, ఉత్కంఠతో థ్రిల్లింగ్‍గా అనిపించిందని ఓటీటీలో చూసిన చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎమోషనల్‍గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి యాక్టింగ్‍పై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ టేకింగ్, స్క్రీన్‍ప్లే అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మహారాజ చిత్రంలో ట్విస్టులను రివీల్ చేసిన విధానం, క్లైమాక్స్ అదిరిపోయాయనే కామెంట్స్ వస్తున్నాయి.
విజయ్ సేతుపతికి మహారాజ.. హీరోగా 50వ మూవీగా ఉంది. థియేటర్లలో సుమారు రూ.110కోట్లను దక్కించుకొని ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతోపాటు మంచి చిత్రంగానూ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అవుతోంది.
ఈ మూవీలో సెలూన్ నడిపే మహారాజ అనే ప్రధాన పాత్ర చేశారు విజయ్ సేతుపతి. యాక్షన్, ఎమోషన్ సీన్లలో మరోసారి తన మార్క్ చూపించారు. ముఖ్యంగా బాధతోనే రివేంజ్ తీర్చుకునే సీన్లలో సేతుపతి నటన అద్భుతంగా ఉంది. ఆయన యాక్టింగ్ ఈ చిత్రానికి ముఖ్యమైన హైలైట్‍గా నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా మహారాజ చిత్రంలో ఓ మెయిన్ రోల్ చేశారు. ఆయన కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మమతా మోహన్ దాస్, నటరాజన్ సుబ్రమణియం, అభిరామి, దివ్య భారతి, అరుల్ దాస్ కూడా కీలకపాత్రలు పోషించారు.
మహారాజ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ సామినాథన్ థ్రిల్లింగ్‍గా నడిపారు. ముఖ్యంగా సెకండాఫ్‍లో కథనం చాలా ఆకట్టుకుంటుంది. ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‍గా సాగుతుంది. ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, అజ్నీష్ లోకనాథ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. ది రూట్, థింగ్ స్టూడియోస్, ప్యాషన్ స్టూడియోస్ పతాకాలపై జగదీశ్ పళనిస్వామి, సుధాన్ సుందరం ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
టాపిక్