ఓటీటీలోకి తమిళ్ ఫీల్ గుడ్ మూవీ.. మిడిల్ క్లాస్ స్టోరీ.. ఒకే రోజు నాలుగు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌-madras matinee ott release date tamil feel good movie in four ott plot forms prime video sun nxt sathya raj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తమిళ్ ఫీల్ గుడ్ మూవీ.. మిడిల్ క్లాస్ స్టోరీ.. ఒకే రోజు నాలుగు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌

ఓటీటీలోకి తమిళ్ ఫీల్ గుడ్ మూవీ.. మిడిల్ క్లాస్ స్టోరీ.. ఒకే రోజు నాలుగు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌

మన కథ.. మన చుట్టూ జరుగుతున్న కథ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, కన్నీళ్లు, సరదాలతో వచ్చిన తమిళ్ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీలోకి దూసుకొచ్చింది. మద్రాస్ మ్యాట్నీ సినిమా ఒకేసారి నాలుగు ఓటీటీల్లో అడుగుపెట్టింది.

ఓటీటీలోకి తమిళ్ మూవీ (x/Simply South)

ఓటీటీల్లోకి ఈ వారం కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు దూసుకొచ్చాయి. థ్రిల్లర్, కామెడీ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు వివిధ భాషలకు చెందిన మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే ఓ తమిళ్ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్ స్టోరీని తీసుకున్న మనసుకు అల్లుకునే విధంగా మలచిన మూవీ ‘మద్రాస్ మ్యాట్నీ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

నాలుగు ఓటీటీల్లో

మద్రాస్ మ్యాట్నీ సినిమా ఒకే రోజు నాలుగు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ తమిళ్ మూవీ ఈ రోజు (జూలై 4) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం ఓటీటీ ఫ్యాన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఒకే సారి నాలుగు ఓటీటీల్లో ఈ మూవీ రిలీజ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు టెంట్ కోట, సన్ నెక్స్ట్, సింప్లీ సౌత్ ఓటీటీలో మద్రాస్ మ్యాట్నీ సినిమా రిలీజైంది.

మనసు హత్తుకునే మూవీ

మనసును హత్తుకుని, హృద‌యాల‌ను కరిగించే మద్రాస్ మ్యాట్నీ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేసింది. జూన్ 6న థియేలర్లలో విడుదలైన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్లింది. ఇప్పుడు ఓటీటీల్లో ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ మూవీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.

ఆటో డ్రైవర్ స్టోరీ

మద్రాస్ మ్యాట్నీ సినిమాకు కార్తీకేయన్ మణి డైరెక్టర్. అతనికి డైరెక్టర్ గా ఇదే ఫస్ట్ మూవీ. థగ్ లైఫ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో పాటే మద్రాస్ మ్యాట్నీ థియేటర్లకు వచ్చింది. ఇందులో సత్యరాజ్, కాలి వెంకట్, రోషిని హరిప్రియన్, షెల్లీ, జార్జ్ మరియన్, సునీల్ సుగత, మధుమిత, గీత తదితరులు నటించారు.

వయసు మీద పడ్డ సైంటిఫిక్ ఫిక్షన్ కథలు రాసే ఓ రైటర్ ఉంటాడు. కామన్ మ్యాన్ గురించి స్టోరీ రాయాలని అతనికి ఛాలెంజ్ ఎదురవుతుంది. ఈ క్రమంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ స్టోరీ రాస్తాడు రైటర్. ఈ క్రమంలో అతని జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, సరదాలు తెలుసుకుంటాడు. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి మనిషిని ఈ మూవీ కదిలిస్తోంది. గతంలోకి తీసుకెళ్తుంది. మిడిల్ క్లాస్ ఆనందాలను చూపిస్తోంది. ఈ సినిమాను మద్రాస్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం