Madhavi Latha on Marriage: డేటింగ్‌లో మాధవి లత.. ! తెలుగు వ్యక్తి మాత్రం కాదని వెల్లడి-madhavi latha says she is dating with non telugu guy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Madhavi Latha On Marriage: డేటింగ్‌లో మాధవి లత.. ! తెలుగు వ్యక్తి మాత్రం కాదని వెల్లడి

Madhavi Latha on Marriage: డేటింగ్‌లో మాధవి లత.. ! తెలుగు వ్యక్తి మాత్రం కాదని వెల్లడి

Maragani Govardhan HT Telugu
Mar 25, 2023 09:48 PM IST

Madhavi Latha on Marriage: ప్రముఖ హీరోయిన్, రాజకీయ నేత మాధవి లత ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే అతడు తెలుగు వ్యక్తి మాత్రం కాదని స్పష్టం చేసింది. పెళ్లి విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది.

మాధవి లత
మాధవి లత

Madhavi Latha on Marriage: నచ్చావులే సినిమాతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన హీరోయిన్ మాధవి లత. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ అడపాదడపా హిట్లు దక్కించుకుందే తప్పా పెద్దగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈమె భారతీయ జనతా పార్టీలో చేరింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇంతవరకు పెళ్లి చేసుకోని మాధవి.. వచ్చే ఏడాది వరకు పెళ్లే ప్రస్తావన తీసుకురావద్దని తన ఫాలోవర్లకు సూచించింది. ఈ విషయంపై ఫుల్లు క్లారిటీతో ఉన్నట్లు స్పష్టం చేసింది.

"నేను ఒకరిని కలిశాను. ముందు అతడిని నేను అర్థం చేసుకోవాలి. ఇరు వైపుల మా తల్లిదండ్రులు అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే ప్రక్రియ కాదు. ఇదంతా సర్దుకోడానికి మరో ఏడాది సమయం పట్టవచ్చు. నేను అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతాను. వివాహ తేదీ గురించి మాత్రం అడగొద్దు." అని మాధవిలత తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది.

తను ఇష్టపడిన వ్యక్తి గురించి హింట్ కూడా ఇచ్చింది మాధవి. అతడు తెలుగు వ్యక్తి మాత్రం కాదని స్పష్టం చేసింది.

"తెలంగాణ యాసలో మాట్లాడుతున్నాను కాబట్టి తెలంగాణ వ్యక్తి అని మీరు అనుకోవద్దు. అసలు అతడు తెలుగువాడే కాదు. ఎందుకంటే నేను క్షత్రియ హిందువును. కాబట్టి నేను నా నమ్మకాలను గౌరవించే, షేర్ చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. ఆ విషయంలో తగ్గేదేలే." అని మాధవి తెలిపింది.

మాధవి లత తెలుగులో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మాధవి, స్నేహితుడా, అరవింద్-2 లాంటి చిత్రాల్లో అలరించింది. అయితే ఆమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ మాత్రం రాలేదు. 2018లో బీజేపీలో చేరిన ఆమె.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది.

Whats_app_banner