Madhavan: 2007లోనే షూటింగ్ పూర్తి - వివాదాలతో రిలీజ్‌కు నోచుకోని మాధవన్ తెలుగు హారర్ మూవీ ఇదే!
Madhavan: 2007లో తను నేను ఆమె అనే హారర్ మూవీతో మాధవన్ హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కోన వెంకట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వివాదాల కారణంగా రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ సినిమాలో షమితా శెట్టి, సదా హీరోయిన్లుగా నటించారు.
Madhavan: తమిళ హీరో మాధవన్‌కు తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి, యువతో పాటు గౌతమ్ మీనన్ చెలి వంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సఖి రిలీజ్ తర్వాత తెలుగులో మాధవన్‌కు పలు ఆఫర్స్ వచ్చాయి. నువ్వు నేనుతో పాటు పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించే ఛాన్స్‌లు దక్కించుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల మాధవన్ ఆ సినిమాలు చేయలేకపోయాడు
హారర్ మూవీతో...
2007లో మాధవన్...కోన వెంకట్ డైరెక్షన్‌లో ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు తెలుగులో నేను తను ఆమె అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తొలుత ఈ మూవీకి ఇది ఒక అదిలే అనే పేరు అనుకున్నారు. కథకు యాప్ట్ కాదనే ఆలోచనతో నేను తను ఆమెగా టైటిల్‌ను ఛేంజ్ చేశారు.హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీతో చాలా ఏళ్ల క్రితమే మాధవన్ హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ వివాదాల కారణంగా సినిమా రిలీజ్‌కు నోచుకోకపోవడంతో మాధవన్ తె లుగు ఎంట్రీ ఆలస్యమైంది.
తను నేను ఆమె మూవీలో సదా, షమితా శెట్టి హీరోయిన్లుగా నటించారు. తొలుత రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను తానే ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అనుకోకుండా వర్మ తప్పుకోవడంతో సౌరభ్ శర్మ నిర్మాత బాధ్యతలు చేపట్టారు.
నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు...
నేను తను ఆమె సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. జీవీ ప్రకాష్‌కుమార్, ఆర్‌పీ పట్నాయక్, ధరణ్, ప్రసన్నలను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. ఒకే సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పనిచేయడం అనే కొత్త ట్రెండ్‌తో దక్షిణాది ఆడియెన్స్‌లో నేను తను ఆమె మూవీ ఆసక్తిని రేకెత్తించింది.
తమిళంలో ఈ మూవీకి లీలై అనే పేరు పెట్టారు. అప్పటికే ఆ టైటిల్‌ను మరో ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేసుకోవడంతో నాన్ అవల్ అదుగా మార్చారు. ఇలా ఆరంభం నుంచి ఎన్నో వివాదాలు, ప్రయోగాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ 2007లో షూటింగ్ పూర్తయింది.
మాధవన్ ఫిర్యాదు...
ఆర్థిక సమస్యల కారణంగా మాధవన్‌తో పాటు ఇతర నటీనటులకు తెలియకుండా సీక్రెట్‌గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన ప్రొడ్యూసర్ రెండు భాషల్లో ఈ హారర్ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆడియె ఫంక్షన్‌తో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ చేశారు. తమకు రెమ్యునరేషన్ సరిగా చెల్లించకపోవడమే కాకుండా ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ప్రొడ్యూసర్ ఈ సినిమాపై రిలీజ్ చేయడానికి ప్రయత్నించడంతో మాధవన్ అతడిపై నడిగర్ సంఘానికి ఫిర్యాదు ఇచ్చారు.
మాధవన్ తో పాటు హీరోయిన్లు కూడా సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించకపోవడంతో వారి స్థానంలో డబ్బింగ్ ఆర్టిస్లులతో డబ్బింగ్ చెప్పించి సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ప్రయత్నాలు చేశారు. అవి కూడా ఫలించకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. అలా మాధవన్ తెలుగు డెబ్యూ రిలీజ్‌కు నోచుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు నాగచైతన్య సవ్యసాచి ద్వారా విలన్ పాత్ర ద్వారా తెలుగులోకి మాధవన్ ఎంట్రీ ఇచ్చాడు.