OTT: ముగ్గురు స్టార్ యాక్టర్లు నటించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలోకే రానుందా! వివరాలివే..
Test Movie: టెస్ట్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ఈ దిశగా హింట్ ఇచ్చారు. ఆ వివరాలు ఇవే..
తమిళ మూవీ ‘టెస్ట్’పై ఆసక్తి బాగానే ఉంది. స్టార్ యాక్టర్లు మాధవన్, నయనతార, సిద్ధార్థ్ కలిసి నటించడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, టెస్ట్ మూవీ నుంచి చాలా కాలంగా పెద్దగా అప్‍డేట్లు రాలేదు. అయితే, ఈ స థియేటర్లలో కాకుండా ఓటీటీలోకే నేరుగా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన ముగ్గురు సోషల్ మీడియాలో నేడు (ఫిబ్రవరి 2) చేసిన పోస్టుతో డైరెక్ట్ స్ట్రీమింగ్ అనే అంచనాలు వచ్చాయి. ఆ వివరాలు ఇవే..

నెట్‍ఫ్లిక్స్‌లో నెక్స్ట్ ఏంటి? అంటూ..
మాధవన్, నయనతార, సిద్ధార్థ్.. తమ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్లలో ఓ పోస్ట్ చేశారు. “నెట్‍ఫ్లిక్స్‌లో నెక్స్ట్ ఏం రానుందో.. ఫిబ్రవరి 3న చూడండి” అంటూ షేర్ చేశారు. ఫిబ్రవరి 3 కోసం మీరు రెడీ ఉండడనేలా రాసుకొచ్చారు. ముగ్గురు వారివారి ఫొటోలతో ఈ పోస్ట్ చేశారు.
“ఏదో సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది.. నెట్‍ఫ్లిక్స్‌లో తర్వాత ఏం వస్తుందో ఫిబ్రవరి 3న చూడండి” అంటూ నయనతార రాసుకొచ్చారు. ప్లేను ప్రెస్ చేసేందుకు రెడీగా ఉండండి అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేశారు. కెమెరా, లైట్స్.. గెట్ రెడీ అంటూ మాధవన్ క్యాప్షన్ రాశారు. ఫిబ్రవరి 3న నెట్‍ఫ్లిక్స్‌లో ఏం రానుందో చూడండి అంటూ పేర్కొన్నారు.
ఈ ముగ్గురి పోస్ట్ బట్టి చూస్తే.. టెస్ట్ చిత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంధించిన అనౌన్స్‌మెంట్ రేపు (ఫిబ్రవరి 3) రానుంది. లేకపోతే స్ట్రీమింగ్‍కే వచ్చేస్తుందా అనేది చూడాలి.
షూటింగ్ పూర్తయి ఏడాది!
టెస్ట్ సినిమాకు కొత్త డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై చక్రవర్తి రామచంద్, శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ 2023 ఏప్రిల్‍లోనే మొదలైంది. 2024 జనవరిలోనే షూటింగ్ పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది. అంటే చిత్రీకరణ పూర్తయి ఏడాది అవుతున్నా ఈ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.
టెస్ట్ చిత్రంలో మీరా జాస్మిన్ కూడా ఓ కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. సుమారు పదేళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామా మూవీగా శశికాంత్ తెరకెక్కించారు.
దుమ్మురేపుతున్న పుష్ప 2
పుష్ప 2: ది రూల్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం దుమ్మురేపుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ నేషనల్ వైడ్‍గా నెట్‍ఫిక్స్‌లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. గ్లోబల్‍గానూ టాప్-10 ట్రెండింగ్‍లో ఉంది. ఆ స్థాయిలో ఈ చిత్రం దుమ్మురేపుతోంది.
జనవరి 30వ తేదీన పుష్ప 2 చిత్రం రీలోడెడ్ వెర్షన్‍తో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. గత డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసి అనేక రికార్డులను బద్దలుకొట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది.
సంబంధిత కథనం