Madha Gaja Raja: 12 ఏళ్ల కిందటి విశాల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు.. తెలుగులోనూ వచ్చేస్తోంది-madha gaja raja box office collection movie of vishal enters 50 crores club to release in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Madha Gaja Raja: 12 ఏళ్ల కిందటి విశాల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు.. తెలుగులోనూ వచ్చేస్తోంది

Madha Gaja Raja: 12 ఏళ్ల కిందటి విశాల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు.. తెలుగులోనూ వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu
Jan 23, 2025 07:34 PM IST

Madha Gaja Raja: తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన 12 ఏళ్ల కిందటి మూవీ మదగజరాజ తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

12 ఏళ్ల కిందటి విశాల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు.. తెలుగులోనూ వచ్చేస్తోంది
12 ఏళ్ల కిందటి విశాల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు.. తెలుగులోనూ వచ్చేస్తోంది

Madha Gaja Raja: మదగజరాజ మూవీ ఈ ఏడాది పొంగల్ కు రిలీజై తమిళనాడు ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. నిజానికి 12 ఏళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది పండుగకు రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. తమిళనాట రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం విశేషం. గతేడాది అరణ్మనై 4 మూవీ ద్వారా సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ సుందర్ సి ఈ మదగజరాజను కూడా డైరెక్ట్ చేశాడు.

yearly horoscope entry point

మదగజరాజ బాక్సాఫీస్

స్టార్ హీరో విశాల్ నటించిన మూవీ మదగజరాజ. ఈ సినిమాను 2012లోనే అనౌన్స్ చేశారు. 2013లో షూటింగ్ పూర్తయి రిలీజ్ కు సిద్ధమైంది. అయితే వివిధ ఆర్థిక, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఏకంగా 12 ఏళ్ల పాటు థియేటర్లలోకి రాలేకపోయింది. మొత్తానికి ఈ ఏడాది పొంగల్ సందర్భంగా రిలీజైంది.

అయితే ఊహకందని విధంగా తమిళనాడు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో మదగజరాజ మూవీ ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అందుకుంది. 12 ఏళ్ల కిందటి మూవీకి ఈ స్థాయి వసూళ్లు రావడం మామూలు విషయం కాదు. అందులోనూ రూ.15 కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందింది. దీంతో మేకర్స్ పై లాభాల వర్షం కురుస్తోంది.

తెలుగులోనూ రిలీజ్

విశాల్ నటించిన మదగజరాజ మూవీ తెలుగులోనూ రాబోతోంది. ఈ మూవీని డబ్ చేసి జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు తమిళ ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పొంగల్ కు మనతోపాటు అక్కడ కూడా వచ్చిన శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ ఫెయిల్యూర్ కూడా ఈ మదగజరాజ బాక్సాఫీస్ వసూళ్లకు కారణమైంది.

తెలుగులోనూ ఈ సినిమాకు ఆశించిన మేర వసూళ్లు వస్తే మాత్రం మదగజరాజ బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. సంతానం ముఖ్యమైన పాత్ర పోషించాడు. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం