Mad Square Trailer: గోవాలో రచ్చరచ్చ.. పంచ్‍లే పంచ్‍లు.. అదిరిపోయే ఫన్‍తో మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్.. చూసేయండి-mad square trailer with fun and bunch of punches narne nithiin sangeeth shobhan ram nitin and vishnu oi shines ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mad Square Trailer: గోవాలో రచ్చరచ్చ.. పంచ్‍లే పంచ్‍లు.. అదిరిపోయే ఫన్‍తో మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్.. చూసేయండి

Mad Square Trailer: గోవాలో రచ్చరచ్చ.. పంచ్‍లే పంచ్‍లు.. అదిరిపోయే ఫన్‍తో మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్.. చూసేయండి

Mad Square Trailer: మ్యాడ్ స్క్వేర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఫన్ మోడ్‍లో పంచ్‍లతో ట్రైలర్ అదిరిపోయింది. గోవాలో నలుగురు ఫ్రెండ్స్ చేసే రచ్చ చుట్టూ కామెడీ ఆకట్టుకుంది.

Mad Square Trailer: గోవాలో రచ్చరచ్చ.. పంచ్‍లే పంచ్‍లు.. అదిరిపోయే ఫన్‍తో మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్.. చూసేయండి

మ్యాడ్ స్క్వేర్ చిత్రంపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో ఈ కామెడీ చిత్రం తెరకెక్కింది. సూపర్ హిట్ అయిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‍గా వస్తోంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం మరో రెండు రోజుల్లో మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (మార్చి 26) ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

ఫుల్ ఫన్‍తో..

లడ్డూ గాడి పెళ్లి కోసం గోవాకు పోయి మ్యాడ్ గ్యాంగ్ చేసే రచ్చతో మ్యాడ్ స్క్వేర్ చిత్రం ట్రైలర్ ఉంది. పంచ్‍ల వర్షం కురిసింది. సంతోష్ శోభన్ మరోసారి టైమింగ్‍తో దుమ్మురేపాడు. నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ కూడా అదరగొట్టారు. ఫుల్ ఫన్‍‍తో, క్లీన్ కామెడీతో, ఎంటర్‌టైనింగ్‍గా మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ ఉంది. డైరెక్టర్ కల్యాణ్ శంకర్ మరోసారి మ్యాజిక్ చేసినట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.

ట్రైలర్ సాగిందిలా..

లడ్డూ (విష్ణు ఓయ్) పెళ్లికి గోవాకు వెళ్లి ధూమ్‍ధూమ్ చేయాలనుకుంటారు అశోక్ (నార్నే నితిన్), డీడీ అలియాజ్ దామోదర్ (సంగీత్ శోభన్), మనోజ్ (రామ్ నితిన్). పెళ్లి ఆపేస్తాం.. ఆపేస్తాం అంటూ హంగామా చేస్తారు. లడ్డూను పరేషాన్ చేస్తారు. మొత్తంగా పెళ్లి ఆగిపోతుంది. వాడి అసలు రంగు బయటపడిందని లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్) అంటే.. రంగు గురించి మాట్లాడొద్దని, నువ్వేం తెలుపా అంటూ పెళ్లి కూతురు తండ్రి అంటాడు. ఈ పంచ్ బాగానే వర్కౌట్ అయింది. గోవాలో అందరూ గలీజోళ్లు ఉన్నారు మామ అని లడ్డూ అంటే.. తెలుగోళ్లంతా ఇక్కడే తిరుగుతున్నారంటూ అశోక్ కౌంటర్ ఇస్తాడు.

రిసార్టులో నలుగురూ రచ్చ చేస్తారు. పోలీస్ గెటప్‍లోనూ హంగామా చేస్తారు. వారి కోసం పోలీసులు కూడా వెతుకుతుంటారు. పిడికి గట్టిగా బిగిస్తే వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయారని పోలీస్‍గా ఉండే సత్యం రాజేశ్ అంటే.. వాళ్లను పట్టుకోమంటే ఇనుక ఎందుకు పట్టుకున్నావయ్యా అని ఆఫీసర్ అంటాడు. లడ్డూ నాన్న కిడ్నాప్ అవడం, ఆయనను కాపాడేందుకు తంటాలు పడి రౌడీలకు చిక్కడం ఇలా ఫన్ బాగా జనరేట్ అయింది. ఫోన్ చేసిన వ్యక్తి భాయ్ అంటే.. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతానని లడ్డూ వేసే పంచ్‍తో మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ ముగిసింది. ఫన్‍తో ఈ ట్రైలర్ అదిరిపోయింది.

మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి టికెట్ల బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు ప్రొడ్యూజ్ చేశాయి. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ట్రైలర్‌ వైబ్‍కు భీమ్స్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నితిన్ ‘రాబిన్‍హుడ్’ పోటీగా వస్తోంది. రెండు చిత్రాలు మార్చి 28నే విడుదల కానున్నాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం