ఓటీటీల్లో తప్పక చూడాల్సిన ఐదు లేటెస్ట్ చిత్రాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. వీకెండ్‍లో ప్లాన్ చేసుకోండి!-mad square streaming on netflix ott empuraan hotstar release this week movies in telugu amazon prime video havoc ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీల్లో తప్పక చూడాల్సిన ఐదు లేటెస్ట్ చిత్రాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. వీకెండ్‍లో ప్లాన్ చేసుకోండి!

ఓటీటీల్లో తప్పక చూడాల్సిన ఐదు లేటెస్ట్ చిత్రాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. వీకెండ్‍లో ప్లాన్ చేసుకోండి!

ఈవారం ఓటీటీల్లోకి కొన్ని అదిరిపోయే చిత్రాలు వచ్చాయి. వివిధ జానర్ల సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. తెలుగులో ఈవారం ఓటీటీల్లోకి వచ్చిన ఐదు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి. వీకెండ్‍కు ప్లాన్ చేసుకోండి.

ఓటీటీల్లోకి తెలుగులో ఈ వారం తప్పక చూడాల్సిన ఐదు సినిమాలు.. తెలుగులోనే.. వీకెండ్‍లో ప్లాన్ చేసుకోండి!

ఓటీటీల్లో కొత్తగా తెలుగులో వచ్చిన సినిమాలు చూడాలనుకుంటే.. ఈ వీకెండ్‍కు అదిరిపోయే చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వారం తెలుగులో కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో ఐదు చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ఇందులో ఒకటి తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ ఉంది. మిగిలిన నాలుగు సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు సినిమాలు తప్పకుండా చూడాల్సినవే. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకొని.. వీకెండ్ ఎంజాయ్ చేయండి.

మ్యాడ్ స్క్వేర్ (నెట్‍ఫ్లిక్స్)

తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్ ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజై.. రూ.70కోట్లకు పైగా కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది ఈ చిత్రం. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ వీకెండ్‍లో సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసేందుకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మ్యాడ్ స్క్వేర్ మూవీని మిస్ కాకుండా చూసేయండి.

వీర ధీర శూరన్ పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)

తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్ర వీర ధీర శూరన్ పార్ట్ 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ వారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ గురువారం తమిళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలై హిట్ కొట్టింది. ఈ మూవీని డైరెక్టర్ ఎస్‍యూ అరుణ్ కుమార్ తెరకెక్కించారు.

సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

హిందీ సినిమా ‘సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్’ ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలో రీమా కగ్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. స్ఫూర్తికలిగించేలా ఉండే సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో మిస్ కాకండి. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళంలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

ఎల్2: ఎంపురాన్ (జియో హాట్‍స్టార్)

మలయాళ ఆల్‍టైమ్ బ్లాక్‍బస్టర్ ఎల్2: ఎంపురాన్ సినిమా ఏప్రిల్ 24న జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలై రూ.260కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. జియో హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సీక్వెల్ ఎంపురాన్ చిత్రాన్ని తప్పకచూడండి.

హవోక్ (నెట్‍ఫ్లిక్స్)

యాక్షన్ థ్రిల్లర్ సినిమా హవోక్ ఏప్రిల్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో టామ్ హార్డీ హీరోగా నటించగా.. గరెత్ ఇవాన్స్ దర్శకత్వం చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం