Mad Square Song: దుమ్ముదులుపుతున్న సామజవరగమన హీరోయిన్ ఐటమ్ సాంగ్.. 16 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్!-mad square second song swathi reddy top trending on youtube with 1 million plus views reba monica john impressive dance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mad Square Song: దుమ్ముదులుపుతున్న సామజవరగమన హీరోయిన్ ఐటమ్ సాంగ్.. 16 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్!

Mad Square Song: దుమ్ముదులుపుతున్న సామజవరగమన హీరోయిన్ ఐటమ్ సాంగ్.. 16 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్!

Sanjiv Kumar HT Telugu
Dec 29, 2024 05:48 PM IST

Mad Square Swathi Reddy Song Trending On YouTube: యూట్యూబ్‌లో మ్యాడ్ స్క్వేర్ మూవీలోని రెండో సాంగ్ స్వాతి రెడ్డి దుమ్ముదులుపుతోంది. సామజవరగమన హీరోయిన్ రెబా మోనికా జాన్ నర్తించిన ఈ ఐటమ్ సాంగ్ డిసెంబర్ 28న విడుదలై టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకుపోయింది.

దుమ్ముదులుపుతున్న సామజవరగమన హీరోయిన్ ఐటమ్ సాంగ్.. 16 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్!
దుమ్ముదులుపుతున్న సామజవరగమన హీరోయిన్ ఐటమ్ సాంగ్.. 16 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్!

Reba Monica John Swathi Reddy Song Trending: 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. కేవలం ప్రకటనతోనే రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

yearly horoscope entry point

స్వాతి రెడ్డి అంటూ

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'మ్యాడ్ స్క్వేర్' ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'మ్యాడ్' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దీంతో 'మ్యాడ్ స్క్వేర్' పాటలపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. 'లడ్డు గాని పెళ్లి' అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి విడుదలైన మొదటి పాటకు విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ సాంగ్‌గా 'స్వాతి రెడ్డి' అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం.

'లడ్డు గాని పెళ్లి' తరహాలోనే విన్న వెంటనే కట్టిపడేసేలా ఎంతో ఉత్సహంగా మ్యాడ్ స్వ్కేర్ రెండో సాంగ్. మొదటి భాగంలో 'కళ్లజోడు కాలేజ్ పాప' వంటి బ్లాక్ బస్టర్ పాటతో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో 'స్వాతి రెడ్డి' పాటతో మరోసారి తన సత్తా చాటారు. రాబోయే రోజుల్లో ఈ పాట తెలుగునాట ఒక ఊపు ఊపడం ఖాయంగా చెప్పవచ్చు.

16 లక్షలకుపైగా వ్యూస్

ఈపాటికే యూట్యూబ్‌లో 16 లక్షలకుపైగా వ్యూస్‌ సాధించుకుని దుమ్ముదులుపుతోంది. అలాగే, యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండింగ్‌లో ఉంది. డిసెంబర్ 28న విడుదలైన ఈ పాట 24 గంటల్లోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ పాటకు ఉత్సాహభరితమైన సంగీతం అందించడమే కాకుండా, అంతే ఉత్సాహంగా స్వాతి రెడ్డితో కలిసి ఈ పాటను ఆలపించారు భీమ్స్.

ఇక సురేష్ గంగుల సాహిత్యం ప్రేక్షకుల నాడిని పట్టుకున్నట్టుగా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌‌ల త్రయం మరోసారి నవ్వించడానికి వస్తున్నారు. మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు.

సామజవరగమన హీరోయిన్

అదే ఉత్సాహం తాజాగా విడుదలైన రెండవ గీతంలోనూ కనిపించింది. ఇక ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామజవరగమన సినిమాలో హీరోయిన్‌గా అలరించిన రెబా మోనిక జాన్ చేసిన తొలి ఐటమ్ సాంగ్ ఇదే అని చెప్పొచ్చు. ఇందులో ఆమె ప్రజన్స్ మరింత అదనపు అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుండిపోయేలా ఉన్నాయి.

స్వాతి రెడ్డి పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఈ సీక్వెల్‌తో మరోసారి నవ్వుల విందుని అందించనున్నారని తెలుస్తోంది. ఈ 'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్

నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై శ్రీకర స్టూడియోస్‌తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఫిబ్రవరి 26, 2025న థియేటర్లలో అడుగు పెట్టనుంది.

Whats_app_banner