ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లలో విడుదలైన చిత్రాల నుంచి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యే మూవీస్ వరకు ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో దర్శనం ఇస్తూనే ఉంటాయి. వీటిలో హిట్, ఫ్లాప్, డిజాస్టర్స్ అయిన సినిమాలు సైతం ఉంటాయి.
అయితే, కొన్నిసార్లు థియేటర్లలో విడుదలైన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలకు, ఓటీటీలో వచ్చే రెస్పాన్స్‌కు సంబంధం ఉండదు. కానీ, కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడిన చిత్రాలు అదే స్థాయిలో ఓటీటీలో ఆదరణ పొందుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా అలాంటిదే. ఆ మూవీనే మ్యాడ్ స్క్వేర్.
2023లో థియేటర్లలో సైలెంట్‌గా రిలీజయి పెద్ద సౌండ్ చేసిన సినిమా మ్యాడ్. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే మ్యాడ్ స్క్వేర్. గత నెల అంటే మార్చి 28న భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ మూవీ మంచి ఫలితాన్నే దక్కించుకుంది. ఐదు రోజుల్లో రూ. 74 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ తెలుగు కామెడీగా నిలిచింది.
అయితే, మ్యాడ్ స్క్వేర్ సినిమాపై పలు నెగెటివ్ కామెంట్స్ వినిపించినా.. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది ఈ సీక్వెల్ మూవీ. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో అలరించారని టాక్ వచ్చింది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం కూడా బాగుందని రివ్యూస్ వచ్చాయి.
అలాగే, భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమా రిలీజ్‌కు ముందే స్వాతి రెడ్డి, లడ్డు గానీ పెళ్లి పాటలు బాగా హిట్ అయ్యాయి. అయితే, ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, కన్నడ 5 భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిన రోజునే అంటే ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్‌లో స్థానం సంపాదించుకుంది. టాప్ 2 ప్లేస్‌లో మ్యాడ్ స్క్వేర్ నిలిచింది. ఇప్పటికీ మూడు రోజులు కావొస్తున్న అదే టాప్ 2 స్థానంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ మూవీస్‌లో మ్యాడ్ స్క్వేర్ దూసుకుపోతోంది. మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో ఇంకా చూడనివాళ్లుంటే ఎంచక్కా చూసేయండి.
సంబంధిత కథనం