Mad Square OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..-mad square ott release date super hit comedy movie to stream on netflix from 25th april in 5 languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mad Square Ott Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..

Mad Square OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..

Hari Prasad S HT Telugu

Mad Square OTT Release Date: సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. మూవీ రిలీజ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

అఫీషియల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..

Mad Square OTT Release Date: యువతను ఎంతో ఆకట్టుకున్న మూవీ మ్యాడ్ స్క్వేర్. కామెడీతో కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతోంది. ఐదు భాషల్లో రానుండటం విశేషం.

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్

రెండేళ్ల కిందట వచ్చి సంచలనం సృష్టించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన సినిమా మ్యాడ్ స్క్వేర్. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ రాబోతోంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మ్యాడ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్సే ఈ సీక్వెల్ హక్కులను కూడా దక్కించుకుంది. దీంతో ఇది కూడా ఆ ఓటీటీలోకే రానుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.66 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.

మ్యాడ్ స్క్వేర్ మూవీ స్టోరీ ఇదీ..

మ్యాడ్ స్వ్కేర్ కేవ‌లం న‌వ్వించ‌డం కోస‌మే తీసిన సినిమా అని ప్ర‌మోష‌న్స్‌లో నిర్మాత నాగ‌వంశీ చెప్పాడు. ఇందులో క‌థ‌, లాజిక‌ల్‌ల‌ను వెత‌కొద్ద‌ని ముందే హింట్ ఇచ్చాడు. నిర్మాత‌ చెప్పిన‌ట్లే ఈ మూవీ సాగుతుంది. ఫ‌స్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వ‌ర‌కు న‌వ్విస్తూనే ఉంటుంది. సినిమా నిండా ఫ‌న్ కోస‌మే క్రియేట్ చేసిన క్యారెక్ట‌ర్లు, సీన్లు క‌నిపిస్తాయి.

మ్యాడ్‌కు కొన‌సాగింపుగానే ఈ సీక్వెల్ సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మూడేళ్ల త‌ర్వాత డీడీ, అశోక్‌, మ‌నోజ్ ఏం చేస్తున్నార‌ది చూపిస్తూ క‌థ‌ను మొద‌లుపెట్టారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పోటీప‌డేందుకు డీడీ చేసే ప‌నులు న‌వ్విస్తాయి.

ల‌డ్డు పెళ్లి వేడుక‌లోకి ఈ ముగ్గురు స్నేహితులు అటెండ్ అయిన త‌ర్వాత వ‌చ్చే కామెడీ సీన్లు హిలేరియ‌స్‌గా ఉంటాయి. పెళ్లి వేడుక‌లో అశోక్‌, డీడీ, మ‌నోజ్ చేసే సంద‌డి, పెళ్లి కూతురి ఫ్యామిలీతో ల‌డ్డు, అత‌డి తండ్రి సాగించే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ల‌డ్డు పెళ్లి చుట్టే ఫ‌స్ట్ క‌థ‌ను న‌డిపించి ఫ‌స్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు ద‌ర్శ‌కుడు.

థియేటర్లలో ప్రేక్షకులను ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.66 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్లలో మిస్ అయి ఉంటే.. ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం