ఓటీటీలోకి మరో తెలుగు హిట్ మూవీ వచ్చేస్తోంది. సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్ గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిందని టాక్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే వారమే రాబోతుందని సినీ వర్గాలు తెలిపాయి.
‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. మార్చి 28న థియేటర్లతో రిలీజైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఈ మ్యాడ్ స్క్వేర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. ఈ సీక్వెల్‌లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. మ్యాడ్ స్వ్కేర్ కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా అని ప్రమోషన్స్‌లో నిర్మాత నాగవంశీ చెప్పాడు.
ఇందులో కథ, లాజికల్‌లను వెతకొద్దని ముందే హింట్ ఇచ్చాడు. నిర్మాత చెప్పినట్లే ఈ మూవీ సాగుతుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. సినిమా నిండా ఫన్ కోసమే క్రియేట్ చేసిన క్యారెక్టర్లు, సీన్లు కనిపిస్తాయి.
మ్యాడ్‌కు కొనసాగింపుగానే ఈ సీక్వెల్ సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మూడేళ్ల తర్వాత డీడీ, అశోక్, మనోజ్ ఏం చేస్తున్నారది చూపిస్తూ కథను మొదలుపెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీపడేందుకు డీడీ చేసే పనులు నవ్విస్తాయి.
లడ్డు పెళ్లి వేడుకలోకి ఈ ముగ్గురు స్నేహితులు అటెండ్ అయిన తర్వాత వచ్చే కామెడీ సీన్లు హిలేరియస్‌గా నవ్విస్తాయి. పెళ్లి వేడుకలో అశోక్, డీడీ, మనోజ్ చేసే సందడి, పెళ్లి కూతురి ఫ్యామిలీతో లడ్డు, అతడి తండ్రి సాగించే సంభాషణలు ఆకట్టుకుంటాయి. లడ్డు పెళ్లి చుట్టే ఫస్ట్ కథను నడిపించి ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు దర్శకుడు.
సెకండాఫ్ గోవాలో డీడీ గ్యాంగ్ చేసే హంగామా, నెక్లెస్ రాబరీ చుట్టూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగింది.
సంబంధిత కథనం