నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ లిరిక్స్.. మ్యాడ్ మూవీలోని సూపర్ హిట్ పాట మీకోసం.. యూట్యూబ్‌లో 7.7 కోట్ల వ్యూస్-mad movie nuvvu navvukuntu vellipomake song lyrics bheems ceciroleo bhaskarabhatla ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ లిరిక్స్.. మ్యాడ్ మూవీలోని సూపర్ హిట్ పాట మీకోసం.. యూట్యూబ్‌లో 7.7 కోట్ల వ్యూస్

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ లిరిక్స్.. మ్యాడ్ మూవీలోని సూపర్ హిట్ పాట మీకోసం.. యూట్యూబ్‌లో 7.7 కోట్ల వ్యూస్

Hari Prasad S HT Telugu

మ్యాడ్ మూవీలోని నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఈ మూవీ వచ్చి రెండేళ్లయినా ఈ పాట మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ లిరిక్స్.. మ్యాడ్ మూవీలోని సూపర్ హిట్ పాట మీకోసం..

మ్యాడ్ మూవీ తెలుసు కదా. 2023లో వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథతో యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ మూవీలోని నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. భీమ్స్ సీసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాట రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ మెలోడీ సాంగ్స్ లిస్ట్ లో కొనసాగుతూనే ఉంది.

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్

మ్యాడ్ మూవీ అక్టోబర్, 2023లో రిలీజైంది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.24 కోట్లు వసూలు చేసింది. ఇక తాజాగా రిలీజైన ఈ మూవీ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ అయితే దీనికంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది.

మ్యాడ్ మూవీలోని నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే పాట బాగా ఆకట్టుకుంది. భాస్కరభట్ అందించిన లిరిక్స్.. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ ఈ పాటను సూపర్ హిట్ చేశాయి. కపిల్ కపిలన్ ఈ పాట పాడాడు. మరి అలాంటి పాట లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ లిరిక్స్

నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే

నా గుండెనేమో గిల్లి పోమాకే

చిన్ని చిన్ని కళ్లే అందం

ముద్దు ముద్దు మాటలే అందం

బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే

ఎంతో అందమే

ముక్కు మీద కోపం అందం

మూతి ముడుచుకుంటే అందం

ఝుంకాలలా ఊగుతు ఉంటే

ఇంకా అందమే

నీ పిచ్చి పట్టిందిలే

అది నీవైపే నెట్టిందిలే

ఏమైనా బాగుందిలే

నువ్వు ఒప్పుకుంటే

జరుపుకుంట జాతరలే

నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే

నా గుండెనేమో గిల్లి పోమాకే

నువ్వు తప్పుకుంటూ వెళ్లి పోమాకే

పిల్లా నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే

చరణం 1

ఈ తిరిగే తిరుగుడు

గుడి చుట్టూ తిరిగితే

దిగి వచ్చి దేవతే

వరమిస్తానంటదే

నువ్వు కొంచెం కరిగితే

ప్రపంచం మునగదే

ఈ పంతం వదిలితే

యుగాంతం రాదులే ఏ ఏ ఏ

నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే

నా గుండెనేమో గిల్లి పోమాకే

నువ్వు తిప్పుకుంటూ వెళ్లి పోమాకే

పిల్లా నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే

చరణం 2

అవునంటే అవునను

కాదంటే కాదను

నడి మధ్య ఊగితే

నేనెట్టా సావను

నీలాగే అందరూ

విసిగిస్తే అమ్మడు

మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడూ..

నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే

అయ్ అయ్ అయ్ అయ్

నా గుండెనేమో గిల్లి పోమాకే

చూసి చుడనట్టు వెళ్లి పోమాకే

పిల్లా కొంచెం కసురుకుంటూ

ఉండి పోరాదే

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం