8 Vasanthalu: మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ కొత్త మూవీ 8 వసంతాలు.. హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్
Ananthika Sanilkumar 8 Vasanthalu Teaser Released: మ్యాడ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళ బ్యూటిఫుల్ భామ అనంతిక సనిల్‌కుమార్. ఆమె నటించిన లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 8 వసంతాలు. తాజాగా 8 వసంతాలు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..!
Ananthika Sanilkumar 8 Vasanthalu Teaser Released: మోస్ట్ సక్సెస్‌ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది.

8 వసంతాలు ఫస్ట్ లుక్
ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్‌గా చేస్తోంది. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది. 8 వసంతాలు చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌తో ఇప్పటికే మంచి క్రియేట్ చేసింది.
8 వసంతాలు టీజర్ రిలీజ్
తాజాగా 8 వసంతాలు టీజర్‌ను శుక్రవారం (జనవరి 24) మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్తగా విడుదలైన ఈ టీజర్‌లో విడిపోవడం వల్ల కలిగే బాధలతో ఉన్న కన్న పసునూరిని అవంతిక ఓదార్చడంతో ప్రారంభమవుతుంది. అతని దుఃఖం లోతును ఆమె అర్థం చేసుకోలేదని చెప్పడంతో హను రెడ్డితో తన ఫస్ట్ లవ్‌ని రివిల్ చేస్తోంది.
ఎప్పటికీ బయట పడరు
“ఎవరి తుపాన్‌లు వారికి ఉంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు' ఈ డైలాగ్ క్యారెక్టర్స్ బ్యాక్ డ్రాప్‌ని ఎమోషనల్‌గా ప్రజెంట్ చేసింది. ఫణీంద్ర నర్సెట్టి రైటింగ్ కథనంలో పొయిటిక్ టచ్, రివర్స్ ఫ్లాష్‌బ్యాక్‌తో చేయడం టీజర్‌కు డెప్త్ యాడ్ చేసింది.
ఎమోషనల్ లేయర్స్
ఇక అనంతిక సనిల్‌కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది. టీజర్‌లో కన్న పసునూరి, హను రెడ్డి కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. కాగా ఈ 8 వసంతాలు సినిమా విశ్వనాథ్ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం విజువల్‌గా అద్భుతంగా ఉంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఎమోషనల్ డెప్త్‌ని కంప్లీట్ చేసింది. ఈ టీజర్ ఎమోషనల్ లేయర్స్‌కి స్టేజ్‌ని సెట్ చేసింది.
త్వరలో రిలీజ్ డేట్
ప్రముఖ అగ్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు.
ముఖ్య పాత్రలు
ఇక 8 వసంతాలు సినిమాలో అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డితోపాటు రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన అనంతిక సనీల్ కుమార్ రాజమండ్రీ రోజ్ మిల్క్ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది.
మ్యాడ్ మూవీతో
అయితే, ఆ సినిమా అనంతిక సనిల్ కుమార్‌కు అఁతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ, ఆ తర్వాత థియేటర్లలో విడుదలైన మ్యాడ్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకుంది అనంతిక సనిల్ కుమార్. త్వరలో మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా రానున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం