Maavaaru Mastaru June 28th episode: స్కూల్లో విద్యకు అడ్డంగా దొరికిపోయిన గణపతి.. ఏం చేయబోతున్నాడు?-maavaaru mastaru june 28th episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maavaaru Mastaru June 28th Episode: స్కూల్లో విద్యకు అడ్డంగా దొరికిపోయిన గణపతి.. ఏం చేయబోతున్నాడు?

Maavaaru Mastaru June 28th episode: స్కూల్లో విద్యకు అడ్డంగా దొరికిపోయిన గణపతి.. ఏం చేయబోతున్నాడు?

HT Telugu Desk HT Telugu
Jun 28, 2023 07:26 AM IST

Maavaaru Mastaru June 28th episode: స్కూల్లో విద్యకు అడ్డంగా దొరికిపోయిన గణపతి.. ఏం చేయబోతున్నాడు? బుధవారం రానున్న ఈ సీరియల్ 15వ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది.

మావారు మాస్టారు సీరియల్ జూన్ 28 ఎపిసోడ్
మావారు మాస్టారు సీరియల్ జూన్ 28 ఎపిసోడ్

Maavaaru Mastaru June 28th episode: జీ తెలుగులో వస్తున్న మావారు మాస్టారు సీరియల్.. ప్రతి రోజూ ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఉత్కంఠ రేపుతోంది. బుధవారం (జూన్ 28) రాబోయే ఎపిసోడ్ లో కూడా అలాంటి ఓ పెద్ద ట్విస్టే ఉండనుంది. స్కూల్లో గంట కొడుతూ విద్యకు అడ్డంగా దొరికిపోతాడు గణపతి మాస్టారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరం.

yearly horoscope entry point

అయితే అంతకుముందు మంగళవారం (జూన్ 27) ఎపిసోడ్ లో గణపతి స్థానంలో పెళ్లి చూపుల కోసం కూర్చున్న విఘ్నేష్​కి ఓ చిన్న పరీక్ష పెడుతుంది విద్య. తమకు పాతిక కోట్ల ఆస్తి ఉందని గొప్పలు చెప్పుకుంటున్న విఘ్నేష్​ని అసలు పాతిక కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పమని అడుగుతుంది. కానీ విఘ్నేష్​ చెప్పలేకపోతాడు. దాంతో అతని చదువు ఎంతో తేల్చేస్తుంది విద్య.

గణపతి మాస్టారునే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెబుతుంది. అయితే ఆదినారాయణ కూడా ఏది ఏమైనా విద్యను శంకరం మాస్టారు కొడుకైన గణపతికి ఇచ్చి పెళ్లి చేసేది లేదనే తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతాడు. ఆదినారాయణ ఇంట్లో జరిగిన అవమాన భారంతో ఇంటికి చేరుకుంటుంది గణపతి కుటుంబం. జరిగినదాని గురించి ఆలోచిస్తూ విచారంగా కూర్చుంటుంది పార్వతి.

అక్కడ జరిగిన అవమానాన్ని తలుచుకుని కుమిలిపోతుంది. సొంత కొడుకే తనను అందరి ముందు అవమానపరచడంతో బాధతో కుమిలిపోతుంది. తన భర్త చేయని తప్పుకు ఆయనతోపాటు కుటుంబం మొత్తం అవమానపడాల్సి వస్తోందని గతం గుర్తుచేసుకుని ఏడుస్తుంది. గణపతి విద్యను తలుచుకుని బాధపడటం పార్వతి గమనిస్తుంది. అందరూ గణపతిని ఓదారుస్తారు.

సుబ్బు కలగజేసుకుని శ్రీశైలంపై అరుస్తాడు. తమకు ఏముందని ఆదినారాయణ తన కూతురిని గణపతికి ఇచ్చి పెళ్లి చేస్తాడని నిలదీస్తాడు సుబ్బు. ఇంట్లో జరిగిన గొడవతో గణపతి తమ్ముడు సుబ్బు ఏకంగా ఇంటినే విడిచిపెట్టి వెళ్లి వీరేశం కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లిచూపుల్లో విద్య చేసిన అవమానం తలుచుకుంటూ రగిలిపోతాడు విఘ్నేష్​.

ఎలాగైనా గణపతి, విద్యను విడదీసి విద్యను దక్కించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అడ్డువచ్చిన వాళ్లందరినీ చంపేస్తానంటూ కోపంతో ఊగిపోతాడు విఘ్నేష్​. విద్య దక్కకపోతే అందరినీ చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధం అంటూ తండ్రిని హెచ్చరిస్తాడు. మరోవైపు గణపతి రాసిన లెటర్​ గంగమ్మ చేతిలో పడుతుంది. అది చదవలేక గంగమ్మ ఉత్తరం తీసుకొచ్చి పద్మశ్రీని చదవమని ఇస్తుంది.

గణపతి నుంచి లవ్​లెటర్​ అందుకున్న విద్యను అందరి ముందు అవమానపరచాలని నిర్ణయించుకుంటారు పద్మశ్రీ, గంగమ్మ. విద్యను అందరిముందు అవమానపరిచే సరైన సమయం కోసం వేచిచూస్తున్న గంగమ్మ అందరినీ పిలిచి అల్లరి చేయాలనుకుంటుంది. అయితే ఆ ఉత్తరాన్ని ఎవరి కంట పడకుండా చించేస్తుంది లక్కీ.

దాంతో విద్యకు అసలు విషయం తెలియకుండా పోతుంది. లక్కీ ఉత్తరం చించేయడంతో కోపంగా గంగమ్మ పెళ్లిచూపులకు వస్తూ పార్వతి వాళ్లు తెచ్చిన తాంబూలం పళ్లేన్ని విసిరికొడుతుంది. అది చూసిన విద్య వాటిని పార్వతి వాళ్లకి తిరిగి ఇవ్వాలని అనుకుంటుంది. తాను ఎంతగానో ఇష్టపడే గణపతి మాస్టారు పాఠం చెప్పడం నేరుగా చూడాలని ఆశపడుతుంది విద్య.

నేరుగా స్కూల్​కి వెళ్లి గణపతి కోసం వెతుకుతుంది. స్కూల్​కి వెళ్లిన విద్యకు అసలు విషయం తెలిసిపోతుందా? గణపతి మాస్టారు కాదని తెలుసుకున్న విద్య ఏం చేస్తుంది? వంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారమయ్యే మావారు మాస్టారు సీరియల్ మిస్సవకుండా​ చూడాల్సిందే!

Whats_app_banner

సంబంధిత కథనం