Maanvi Gagroo wedding: పెళ్లి చేసుకున్న ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నటి-maanvi gagroo wedding pics gone viral as the actress married to kumar varun
Telugu News  /  Entertainment  /  Maanvi Gagroo Wedding Pics Gone Viral As The Actress Married To Kumar Varun
Maanvi Gagroo married Kumar Varun.
Maanvi Gagroo married Kumar Varun.

Maanvi Gagroo wedding: పెళ్లి చేసుకున్న ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నటి

23 February 2023, 15:44 ISTHari Prasad S
23 February 2023, 15:44 IST

Maanvi Gagroo wedding: పెళ్లి చేసుకుంది ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ ఫేమ్ మాన్వీ గాగ్రూ. ఈ సిరీస్ లో చాలా బోల్డ్ క్యారెక్టర్ పోషించిన ఆమె.. తాజాగా గురువారం (ఫిబ్రవరి 23) కుమార్ వరుణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం విశేషం.

Maanvi Gagroo wedding: అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ చూశారా? నలుగురు ఇండిపెండెంట్, బోల్డ్ అమ్మాయిల చుట్టూ తిరిగే కథ అది. ఈ సిరీస్ లోని నలుగురు నటీమణుల్లో ఒకరు మాన్వీ గాగ్రూ. మిగతా అమ్మాయిల్లాగే ఆ సిరీస్ లో మాన్వీ కూడా చాలా బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ లో మాన్వీ తన నటనతో మెప్పించింది.

ఇప్పుడామె పెళ్లి చేసుకుంది. గురువారం (ఫిబ్రవరి 23) కుమార్ వరుణ్ అనే వ్యక్తితో కలిసి ఏడడుగులు నడిచింది. చాలా కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీళ్ల పెళ్లి జరిగింది. గత నెలలోనే వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగింది. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకుంది.

తన పెళ్లి కోసం మాన్వీ రెడ్ శారీని ఎంచుకుంది. మరోవైపు పెళ్లి కొడుకైన వరుణ్ ఐవరీ కలర్ షేర్వానీలో కనిపించాడు. తమ పెళ్లి పత్రాలపై ఈ ఇద్దరూ సంతకాలు చేస్తున్న ఫొటో కూడా ఇందులో ఉంది. ఈ కొత్త జంటకు ఎంతో మంది శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కుబ్రా సేత్, సయానీ గుప్తా, గౌహర్ ఖాన్, మౌనీ రాయ్ లాంటి నటీమణులు కూడా మాన్వీకి కంగ్రాట్స్ చెప్పారు.

గత నెలలోనే తనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు మాన్వీ వెల్లడించింది. అయితే వాలెంటైన్స్ డే వరకూ కూడా తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో ఆమె చెప్పలేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాను వరుణ్ తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసుకుంది.

కుమార్ వరుణ్ కూడా నటుడే. ముఖ్యంగా కామెడీ షోలలో కనిపిస్తుంటాడు. జాకీర్ ఖాన్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన చాచా విధాయక్ హై హమారే సిరీస్ లో నటించాడు. మరోవైపు మాన్వీ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ తోపాటు పిచెర్స్, ట్రిప్లింగ్ లాంటి వెబ్ సిరీస్ తోపాటు ఉజ్డా చమన్, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ లాంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది.

సంబంధిత కథనం