Maa Oori Polimera 2 Break Even: మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ రాంపేజ్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
Maa Oori Polimera 2 Break Even: మా ఊరి పొలిమేర 2 మూవీ మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
Maa Oori Polimera 2 Break Even: మా ఊరి పొలిమేర 2 మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఆదివారం నాటితో ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. మూడు రోజుల్లో ఈ సినిమా నాలుగున్నర కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. వరల్డ్ వైడ్‌గా మూడున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ మూవీ.
మౌత్ టాక్ కారణంగా మూడు రోజుల్లోనే ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. సోమవారం నుంచి వచ్చే వసూళ్లు అన్నీ లాభాలేనని చెబుతోన్నారు.
మౌత్ టాక్ బాగుండటంతో ఆదివారం రోజు మా ఊరి పొలిమేర 2 మూవీ కోటి యాభై లక్షల వరకు వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. మూడు రోజుల్లో కలిపి తొమ్మిది కోట్లకుపైగా గ్రాస్‌ను, నాలుగున్నర కోట్ల వరకు షేర్‌ను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
2023 కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా మా ఊరి పొలిమేర 2 మూవీ నిలిచింది. మా ఊరి పొలిమేర 2 సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు.
మా ఊరి పొలిమేర సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా సీక్వెల్ మాత్రం థియేటర్లలో రిలీజైంది. మా ఊరి పొలిమేర 2 సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా థియేటర్లలో రిలీజైంది.